Wednesday, May 15, 2024

స్థిరంగా బంగారం ధరలు.. పెరిగిన వెండి

గత కొన్ని రోజులుగా బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు చోటుచేసుకుంటున్నాయి. కాగా నేడు  బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో మార్పు ప్రభావం అప్పుడే పడలేదు. ప్రస్తుతం హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర .. రూ.48,260 వద్ద స్థిరంగా ఉంది. అంతకుముందు వరుసగా 5 రోజులు సుమారు రూ.1500 మేర ధర పెరగడం విశేషం. ఇక 24 క్యారెట్లకు చెందిన తులం బంగారం రేటు హైదరాబాద్‌లో రూ.52,640 వద్ద కొనసాగుతోంది. సిల్వర్ రేటు మాత్రం పెరుగుతూనే ఉంది. మరో 200 పెరగ్గా.. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.67 వేల 700కు పెరిగింది. ఈ మధ్యలో ఇదే గరిష్ట ధర. అక్టోబర్ 5న చివరిసారిగా రూ.67 వేలుగా ఉండటం అత్యధికం. ఇప్పుడు నవంబర్ నెలలో దానిని మించింది. దిల్లీ మార్కెట్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం రేటు రూ.48 వేల 360 వద్ద ఉండగా.. 24 క్యారెట్లకు చెందిన తులం బంగారం రూ.52 వేల 760 వద్ద ట్రేడవుతోంది. ఇక దిల్లీలో వెండి రేటు మాత్రం కాస్త తక్కువే ఉంటుంది. అక్కడ కేజీ సిల్వర్ రూ.61 వేల 700 వద్ద ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement