Friday, May 10, 2024

పెరిగిన బంగారం ధ‌ర‌లు.. ప‌సిడి బాట‌లోనే వెండి

నేడు బంగారం..వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.500 మేర పెరిగి రూ.49,250కి చేరింది. మరికొద్దిరోజుల్లో రూ.50 వేలకు చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు కూడా హైదరాబాద్‌లో రూ.550 మేర పెరిగి 53 వేల 730 వద్ద ఉంది. వరుసగా 3 రోజుల్లో సుమారు రూ.800 మేర రేటు పెరిగింది. ఇక సిల్వర్ విషయానికి వస్తే మరింత చుక్కలు చూపిస్తోంది.

వరుసగా రెండు రోజుల్లోనే కిలోకు రూ.3000 పెరిగింది. తాజాగా రూ.1200 పెరిగి హైదరాబాద్‌లో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.71 వేల మార్కును తాకింది. ఇటీవల కొన్ని సంవత్సరాల్లో చూసినా ఇదే గరిష్టం కావడం ఆందోళన కలిగిస్తోంది. యూఎస్ ఫెడ్ డిసెంబర్ నుంచి వడ్డీ రేట్ల పెంపుపై కాస్త నెమ్మదిస్తుందని ఫెడ్ ఛైర్మన్ ఇటీవల ప్రకటించారు. దీంతో బంగారం, వెండి ధరలకు ఊతమొచ్చినట్లు తెలుస్తోంది. ఇది డాలర్ ర్యాలీకి అడ్డుకట్ట వేసింది. డిసెంబర్ 13-14 తేదీల్లో ఫెడ్ సమావేశం జరగనుంది. మరి ఫెడ్ ఎంత మేర వడ్డీ రేట్లు పెంచుతుందో, మార్కెట్లు ఎలా ప్రతిస్పందిస్తాయో, గోల్డ్, సిల్వర్ రేట్లలో ఎలాంటి మార్పు వస్తుందో చూసేందుకు కాస్త ఎదురుచూడాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement