Monday, May 6, 2024

గీతా సందేశమే-మానవాళికి మార్గదర్శి

ప్రతీ సంవత్సరం మార్గశిర మాసం శుద్ధ ఏకాదశి నాడు అంటే ఈనెల నాల్గవ తేదీ ఏకాదశిని ” గీతాజయం తి”గా పాటిస్తారు. భగవద్గీత గురించి తెలియనివారు, వానకు తడవని వారు ఉండరు. అయితే, భగవద్గీతలోని అంశాలు గురించి మనం వింటున్నా, ఆచరణలోకి తేలేక పోతున్నాము. మానవ జీవితానికి అవసరమైన ముక్తి (మోక్ష) మార్గాన్ని ఎలా పొందాలో శ్రీ కృష్ణ పరమాత్మ విశదీకరించారు. లేకపోతే, మనం చేసే కర్మలు ఆధారం గా జనన- మరణ చక్రం అనే సుడిగుండంలో కొట్టుకొం టుంటాము. ఎప్పటికి ఈ జీవితానికి అంతం ఉండదు కాబట్టి ఇప్పటికైనా ఆలోచించి, కృష్ణ పరమాత్మ గీతలో చెప్పిన మార్గాన్ని అనుసరించి ముక్తిని పొందుదాం.
భగవద్గీత ప్రారంభ అధ్యాయంలో మొదటి శ్లోకం —”ధర్మం క్షేత్రే కురుక్షేత్రే సమవే తా యు యుత్సవ:
మామకా: పాణ్డవాశ్చైవ కిమ కుర్వత సంజయ”

ధర్మ శబ్దంతో గీత ప్రారంభమయింది. గీతాచార్యు డు శ్రీకృష్ణ పరమాత్మ ధర్మ స్వరూపుడు. అందునా మని షి మోక్షసిద్ధికి అవసరమైన ధర్మమార్గాలను అందిస్తున్న ది. ఆ శ్లోకం చివరి రెండు అక్షరాలు ‘జయ’. అంటే జయం అని అర్థం. ధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడ జయం ఉంటుంది అని ముందుగానే మనల్ని పరోక్షంగా హచ్చ రించారు. కాని మనం లౌకిక వాంఛలతో ధర్మాన్ని పెట్టెలో భద్రంగా ఉంచి జీవిస్తున్నాము.
ఆ వ్యామోహం ఉన్నన్ని రోజులు మనం పొందేది విషాద యోగమే! అందుకే పరమాత్మ భగవద్గీతలో మనం ఆచరించవలసిన కర్మలు గురించి, జ్ఞానం పొందే మార్గం, భక్తి పై ఆసక్తి, అందుకు, మనం ఆచరిస్తూ ఎలా పరమాత్మ శరణాగతి పొందగలమో వివరించారు.
కర్మ:—ప్రతీవారు ఉదయం నుంచి ఏదో ఒక పనిని చేస్తూంటాం. ఆ చేసే పనినే కర్మ అంటుంటాం. ఈ కర్మ నిష్కామంగా ఉండాలని చెప్పారు. నిష్కామంగా అంటే ఏ ఫలాపేక్ష లేకుండా చేయమని. కాని మనం చేసే ప్రతి పని లోనూ మనకు కలిగే ప్రయోజనం గురించి ఆలోచిస్తాము నిష్కామ కర్మ ఆచరించకపోతే చిత్తశుద్ధి కలగదు. చిత్త శుద్ధిలేనివాడు వివేకం కోల్పోతాడు. జ్ఞానం సిద్ధింపదు. జ్ఞానం లేకపోతే మోక్షం సిద్ధించదు. కర్మ చేయకుండా ఉండడం కుదరదు. అందుకే భగవంతుడు-
”మయి సర్వాణి కర్మాణి యుధ్యస్వ విగత జ్వర:”
అనే శ్లోకంలో సమస్త కర్మలను పరమాత్మయందే

ఆధ్యాత్మిక చిత్తముతో సమర్పించి కోరికలు కాని, మమకారాలు లేనివాడై చేయాలని బోధిస్తున్నారు. దేని ప్రేరణచేత మానవుడు పాపాలను చేయగలుగుతున్నా డు? అంటే కామ్యకర్మల వలన ఆ కోరికలకు అంతం అనే ది ఉండదు. అవే దు:ఖానికి హతువులు. అందుకే భగవం తుడు ఏ కార్యం చేసినా ఆధ్యాత్మిక చింతనతో చేయడం, ఫలాపేక్ష లేకపోవడం అనే మార్గం చెప్పారు. బంధం- మనో దౌర్బల్యం- వ్యామోహం ఇవన్నీ మనో కల్పనలే.
జ్ఞాన యోగం: అసలు జ్ఞానం అంటే ఏమిటి? ఆత్మ, అనాత్మ జన్మ రహస్యం తెలుసుకోవడం, అసలు ఈ మన స్సులో రాగద్వేషాలు, క్రోధం, కామం, వంటివి ఎందుకు ఉద్భవిస్తున్నాయో తెలుసుకోవడమే జ్ఞానం. మనం ఐహక సుఖాల కోసం వెంపర్లాడుతూ, జీవితం దు:ఖమ యం చేసుకొంటున్నాము. ఆ దు:ఖం నుం డి బయటపడి, మోక్ష మార్గాన్ని తెలు సుకోవడమే జ్ఞానం. ద్రవ్యము వలన సాధింపబడే యజ్ఞం కంటే జ్ఞాన య జ్ఞం గొప్పదని పరమాత్మ వివరించా రు. జ్ఞాన యజ్ఞం అంటే ఆత్మానాత్మ వివేకము. తత్త్వం విచారణ. వీటిని పొందాలంటే. సత్ప్రవర్తన, సత్యవచ నం, భగవంతుని పట్ల విశ్వాసం ఇంద్రియ నిగ్రహం మొదలగు సద్గు ణాలు కలిగి ఉండాలి. జ్ఞానం గురువు ను ఆశ్రయించి దీక్షతో తపస్సులా పొందాలి. జ్ఞానం చేతనే కర్మ సంచయం తొలుగుతుంది.
భక్తి యోగం: మనం సంసారమనే సుడిగుండంలో చిక్కుకొని ఉన్నాము. దీనివల్లనే కామ్యకర్మలు చేస్తూ ఉన్నాము. వాటి దు:ఖం నుండి బయటపడాలంటే భగ వంతుని పట్ల విశ్వాసం, భక్తి ఉండాలి. పరమాత్మను శర ణాగతి పొందాలి. రైతు తన పొలంలో వేసిన పంటను రక్షించుకునేందుకు మధ్యలో వచ్చిన కలుపు మొక్కలు తొలగించిన విధంగా, మనసులోకి చొరబడిన దృశ్య భౌతికమైన అంశాలను తొలగించి తపనతో ఆర్తితో దైవ చింతన కలిగి ఉండాలి. ”కోరికలు లేనివాడు, బాహ్యా భ్యంతర శుద్ధి కలవాడు, సమయస్ఫూర్తి కలవాడు, సమ స్త కార్యములయందు కర్తృత్వం వదలినవాడు, నా యందు భక్తి కలవాడు నాకు ఇష్టుడు” అన్నారు.
దైవ గుణాల పట్ల భయం లేకుండా ఉండడం, అంత:కరణ శుద్ధి, క్రోధం లేకుండా ఉండడం, చంచల స్వభావం లేకుండా ఉండడం, ఎవరికి ద్రోహం చేయకుం డా ఉండడంలాంటి 24 గుణాలను తెలిపారు. అలాగే గొప్పతనం, గర్వం, అహంకారం, కఠినత్వంవంటి గుణా లు అసురగుణాలుగా వివరించారు. దైవీ సంపద గుణాలు అలవరుచుకొంటే, శ్రీ కృష్ణ పరమాత్మ భక్తుని యోగక్షేమా లు తానే చూస్తానని వివరించారు. నన్నే శరణు పొందు ము. నిన్ను సమస్త పాపాల నుండి విముక్తుణ్ణి చేసి, మోక్షం కలిగిస్తానని చెప్పారు. ఆయన చెప్పిన దైవసంపత్తి గుణా లను అలవరచుకొని, శ్రీ కృష్ణుడుని శరణు కోరి, రక్షణ పొందుదాం.

Advertisement

తాజా వార్తలు

Advertisement