Saturday, May 4, 2024

నేటి బంగారం.. వెండి ధ‌ర‌లు

నేటి బంగారం..వెండి ధ‌రలు ఇలా ఉన్నాయి.. ప్రస్తుతం 22 క్యారెట్లకు చెందిన తులం గోల్డ్ రేటు హైదరాబాద్‌లో తులానికి రూ.500 పడిపోయింది. దీంతో ఇప్పుడు రూ.52,400కు దిగివచ్చింది. అంతకుముందు ఫిబ్రవరి 3,4 తేదీల్లో కలిపి రూ.1200 మేర తగ్గింది బంగారం ధర. మరోవైపు 24 క్యారెట్లకు చెందిన ప్యూర్ గోల్డ్ 10 గ్రాములకు రూ.550 మేర పతనం కాగా.. ప్రస్తుతం రూ.57,160 వద్ద ట్రేడవుతోంది.

దిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.600 పతనమై.. రూ.52,450కి చేరింది. ఇదే సమయంలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు తులానికి రూ.550 పడిపోయి.. రూ.57,310 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌తో చూస్తే గనుక దిల్లీలో గోల్డ్ రేటు కాస్త ఎక్కువే పలుకుతుంది. మరోవైపు వెండి ధరలు కూడా దారుణంగా పడిపోతున్నాయి. తాజాగా దిల్లీలో కేజీ సిల్వర్ రూ.550 పడిపోయి.. రూ.70,800 మార్కుకు చేరింది. హైదరాబాద్‌లో కిలోకు ఏకంగా వెండి రేటు రూ.1000 పతనమైంది. దీంతో ప్రస్తుతం హైదరాబాద్‌లో కేజీ సిల్వర్ రూ.72,500కు పడిపోయింది. సరిగ్గా వారం కిందట ఒక దశలో హైదరాబాద్‌లో వెండి రూ.77,800కు చేరడం గమనార్హం. అంటే ఏకంగా రూ.5,300 తగ్గింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement