Thursday, April 25, 2024

ఎన్నికల కోడ్ – నూతన సచివాలయం ప్రారంభోత్సవం వాయిదా

హైదరాబాద్ – తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభోత్సవం వాయిదా పడింది. ఈ నెల 17న సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా నూతన సచివాలయాన్ని ప్రారంభించాలన్న సంకల్పంతో ఉంది ఈలోగా ఎన్నికల కోడ్ రానే వచ్చేసింది. ఏపీ, తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూలు విడుదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే .. నిజానికి తెలంగాణ ప్రభుత్వం నూతన సచివాలయ నిర్మాణాన్ని ఆఘమేఘాల మీద పూర్తి చేసింది. ప్రారంభోత్సవానికి ముహూర్తం కూడా ఖరారు చేసింది . ఎన్నికల కోడ్ రావడంతో వాయిదా తప్పలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement