Sunday, April 28, 2024

నేటి బంగారం ధ‌ర‌లు-పెరిగిన వెండి

నేటి బంగారం ధ‌ర‌లు ఇలా ఉన్నాయి.. ఈ వారం బంగారానికి మంచి ట్రెండ్ కనిపిస్తోంది. వారం ప్రారంభం నుంచి పెరుగుతూ వచ్చిన ధరలు.. నిన్న ఒక్క రోజు తగ్గాయి. మళ్లీ వెంటనే నేడు పెరుగుదలను నమోదు చేశాయి. దీంతో హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.250 పెరిగి రూ.46,650కి చేరుకుంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.270 పెరిగి రూ.50,890గా నమోదైంది. బంగారంతో పాటు నేడు వెంటి రేట్లు కూడాపెరిగాయి. కేజీ వెండి ధర హైదరాబాద్‌లో రూ.700 పెరిగి రూ.59,500గా రికార్డయింది. హైదరాబాద్‌తో పాటు విజయవాడలో కూడా బంగారం, వెండి ధరలు పెరిగాయి. విజయవాడలో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.250 పెరిగి రూ.46,650గా ఉంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.270 పెరిగి రూ.50,890గా రికార్డయింది. వెండి ధర విజయవాడలో రూ.700 పెరిగి రూ.59,500గా నమోదైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement