Friday, April 26, 2024

ఊర‌టనిస్తున్న బంగారం ధ‌ర .. ఎంత త‌గ్గిందంటే ..

బంగారం ధ‌ర కాస్త త‌గ్గుముఖం ప‌ట్టింది. నిన్న స్వల్పంగా దిగి రాగా, మంగళవారం కొంచెం ఊరటనిచ్చాయి. మున్ముందు పెళ్లిళ్ల సీజన్‌ ఉండటంతో మరింత పెరిగే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. తాజాగా నమోదైన ధరల వివరాలు ఇలా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,380గా ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,040 వద్ద కొనసాగుతోంది.విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,040గా ఉంది.విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,950 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.49,040వద్ద కొనసాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement