Thursday, May 2, 2024

చిరంజీవి..స‌ల్మాన్ కోసం రంగంలోకి దిగిన ప్ర‌భుదేవా

బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ గాడ్ ఫాద‌ర్ చిత్రంలో ముఖ్య‌మైన పాత్ర‌ని పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా, చిత్రీకరణ పరంగా ముగింపు దశకి చేరుకుంది. తమిళ దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. చిరూ .. సల్మాన్ లపై ఒక పాటను చిత్రీకరించడానికి సన్నాహాలు చేశారు. ఈ పాటకి కొరియోగ్రఫీ చేయించడానికి ప్రభుదేవాను రంగంలోకి దింపారు. ఈ ఇద్దరితోను ప్రభుదేవా కలిసి పనిచేశారు. ఇద్దరి బాడీ లాంగ్వేజ్ లు ఆయనకి బాగా తెలుసు.ఈ సాంగ్ ని ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలిపే ఆలోచనలో ఉన్నారు. ప్రభుదేవా కూడా తన వైపు నుంచి గట్టిగానే కసరత్తు చేశాడ‌. నయనతార కీలకమైన పాత్రను పోషిస్తున్న ఈ సినిమాలో, ఓ జర్నలిస్ట్ పాత్రలో పూరి జగన్నాథ్ కనిపించనుండటం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement