Thursday, May 16, 2024

మా బ‌కాయిలు ఇప్పించండి-తెలుగు రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్ల‌కి యాక్సిస్ బ్యాంక్ లేఖ‌

2006లో ఉమ్మ‌డి ప్ర‌భుత్వం జారీ చేసిన విద్యుత్ బాండ్ల మెచ్యూరిటీకి సంబంధించిన చెల్లింపుల్లో జాప్యం జ‌రుగుతోందంటూ తెలుగు రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్ల‌కి యాక్సిస్ బ్యాంక్ లెట‌ర్ రాసింది. తమకు రావాల్సిన రూ. 35.70 కోట్ల మొత్తాన్ని ఇప్పించాలని గవర్నర్లను కోరింది యాక్సిస్ బ్యాంక్. 2006 లో ఏపీ ట్రాన్స్కో జారీ చేసిన విద్యుత్ బాండ్లకు డిబెంచర్ ట్రస్టీ హోదాలో ఈ లేఖ రాస్తున్నట్టు యాక్సిస్ బ్యాంక్ వెల్లడించింది. 2021 సెప్టెంబర్ 9 తేదీ నాటికి మెచ్యూర్టీ చెందిన మొత్తం రూ. 156.70 కోట్ల విలువైన బాండ్లకు ఏపీ, తెలంగాణ ట్రాన్సుకోలు చెల్లించాల్సిన మొత్తంలో రూ. 35.70 కోట్లు బకాయులున్నాయని లేఖలో పేర్కొన్న యాక్సిస్ బ్యాంక్…. కాల పరిమితి ముగిసిన బాండ్ల తిరిగి చెల్లింపులపై ఎన్ని మార్లు లేఖలు రాసినా స్పందించడం లేదని గవర్నర్లకు రాసిన లేఖలో స్పష్టం చేసింది. ఈపీఎఫ్, పీఎఫ్, పీపీఎఫ్ ట్రస్టులతో పాటు వివిధ బ్యాంకుల గ్రాట్యుటీ ఫండ్లు కూడా విద్యుత్ బాండ్లను కొనుగోలు చేశాయని గవర్నర్ల దృష్టికి తీసుకెళ్లింది యాక్సిస్ బ్యాంక్.

Advertisement

తాజా వార్తలు

Advertisement