Thursday, May 23, 2024

ప్రేమతోనే ఆ గిఫ్ట్​లు ఇచ్చాను.. మనీలాండరింగ్​తో పోల్చొద్దు: సుకేశ్​ చంద్రశేఖర్​

జాక్వెలిన్​ ఫెర్నాండేజ్​తో తనకున్న  రిలేషన్​ మనీ రిలేషన్​ కాదని, నిజమైన ప్రేమ అని తెలిపాడు సుకేశ్​ చంద్రశేఖర్​. మనీ లాండరింగ్​ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న తను ఇవ్వాల ఓ లేఖ ద్వారా పలు వివరాలు వెల్లడించారు. 

తనకు నాకు మధ్య ఆర్థిక పరమైన లావాదేవీలేవీ లేవని, తను ప్రేమతో అందించిన కానుకలతో ఆమెను ఈ కేసుకు లింక్​ పెట్టొద్దని అధికారులను కోరారు.  కాగా, ఈ మధ్య బయటపడి, సోషల్​ మీడియాలో వైరల్​ అయిన ఫొటోలు చాలా విచారకరమన్నారు. తనను ఎంతో కలవరపెట్టాయన్నారు. తను ఆమెను ప్రేమించానని, తప్పుగా జాక్వెలిన్​న్​ చూపుతూ ట్రోల్స్​ చేయొద్దని కోరాడు.   

‘‘నేను ఆమెకు వస్తువులను మాత్రమే బహుమతిగా ఇచ్చాను. ఆమె కుటుంబం కోసం పనులు చేశాను.. ఒక వ్యక్తి తన ప్రియమైన వ్యక్తి కోసం చేసే సాధారణ పనులే ఇవన్నీ.. ఇది వ్యక్తిగతం. దాన్ని ఎందుకు ఇంత రాద్దాంతం చేస్తున్నారో   అర్థం కావడం లేదు. అదే సమయంలో  ఇవేవీ నేరం కిందకి రావు అనుకుంటున్నా  ఇదంతా చట్టబద్ధమైన సంపాదనతో తనకు గిఫ్ట్​గా ఇచ్చినవే.  ఈ విషయాలన్ని న్యాయస్థానంలో అతి త్వరలో రుజువు అవుతాయి’’  అని సుకేష్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. కానీ, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఏ విధంగానూ తప్పు చేయలేదని అతను చెప్పాడు  

₹ 200 కోట్ల మనీ-లాండరింగ్ కేసు విచారణలో భాగంగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్​తో సుకేశ్ కున్న రిలేషన్​షిప్​ వంటివి ఈ మధ్య కాలంలో బయటికి వచ్చాయి.  కాగా, చంద్రశేఖర్‌తో​ కలిసి ఉన్న ఫొటోలను ప్రచురించవద్దని ఇటీవల జాక్వలిన్​ మీడియాకు విజ్ఞప్తి చేసింది. ఉన్నత స్థాయి వ్యక్తుల నుండి డబ్బును మోసగించి, దోపిడీకి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సుఖేష్ చంద్రశేఖర్ నుండి ఆమె అందుకున్న బహుమతులపై ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఆమెను డిసెంబరులో 10 గంటలకు పైగా ప్రశ్నించింది.

- Advertisement -

అయితే.. చంద్రశేఖర్ నుండి ₹ 52 లక్షల విలువైన గుర్రం, ₹ 9 లక్షల విలువైన పర్షియన్ పిల్లి, రత్నాలు పొదిగిన చెవిపోగులు, హీర్మేస్ బ్రాస్‌లెట్ వంటి బహుమతులతో పాటు  1.5 లక్షల డాలర్ల రుణాన్ని అందుకున్నట్లు ఆమె అంగీకరించినట్లు తెలిసింది. ఆమె ఒక మినీ కూపర్ కారును కూడా అతడి నుంచి బహుమతిగా పొందింది.. కానీ, ఆ తర్వాత దాన్ని తిరిగి ఇచ్చినట్టు తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement