Monday, June 10, 2024

TS : ట్రాన్స్ జెండర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి…జిల్లా ప్రధాన న్యాయమూర్తి

తెలంగాణలో హైదరాబాద్ తర్వాత ట్రాన్స్ జెండర్లకు నిజామాబాద్‌లో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఓపి సేవలు అందుబాటులోకి వచ్చాయని, జిల్లాలోని ప్రతి ఒక్క ట్రాన్స్ జెండర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రెండవ అంతస్తులో ట్రాన్స్ జెండర్‌ల ప్రత్యేక ఓపి క్లినిక్‌ను ఆమె ప్రారంభించారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ట్రాన్స్ జెండర్లు నిత్యం ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల తో ఇబ్బందులు పడి ఎక్కడ తమ ఆరోగ్య సమస్యలు ఏ డాక్టర్‌కు ఏ ఆసుపత్రిలో చూపించుకోవాలో తెలియక అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని వారి కోసం చక్కని పరిష్కారం చూపే విధంగా ఈ ఓపి సెంటర్ ను ప్రారంభించడం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపర్ ఇండెంట్ డాక్టర్ ప్రతిమ రాజు సంవత్సరం పాటు ఈ క్లినిక్ కోసం ఎంతో కష్టపడి పని చేశారని వారి కష్టానికి ఈరోజు ఫలితం దక్కిందన్నారు.

జిల్లాలోని ట్రాన్స్ జెండర్లు నిర్భయంగా ఇకనుండి ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పటికీ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరోగ్య చెకప్ చేసుకోవాలని సూచించారు ఏ ఒక్కరు కూడా ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడొద్దని ఆమె కోరారు. అదేవిధంగా ఆరోగ్యకరమైన చికిత్స కోసం వస్తే తమ ఆరోగ్య సమస్యలు ఎక్కడ బయటపడతాయోనని కొందరు భయపడతారని అలాంటి భయపడాల్సిన అవసరం ఏమీ లేదని మీ ఆరోగ్యపరమైన వివరాలను పూర్తిగా గోప్యతను వైద్యులు, ఆసుపత్రి సూపర్డెంట్ బాధ్యత వహించి మీ వివరాలను ఎవరికి తెలియనివ్వకుండా ఉంచుతారన్నారు.

అనంతరం సూపరిండెంట్ ప్రతిమారాజ్ మాట్లాడుతూ ఇప్పటికే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిత్యం ఎంతో మందికి వైద్య సేవలు అందిస్తున్నామని ఇకనుంచి ట్రాన్స్ జెండర్లకు కూడా ప్రత్యేకంగా ఓ పి వైద్య సేవలు అందించడం జరుగుతుందని ఆమె అన్నారు ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. అనుభవజ్ఞులైన డాక్టర్లచే ఓ పి వైద్య సేవలు అందిస్తామని ఆమె అన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డిసిపి కోటేశ్వరరావు, ట్రైనీ ఐపీఎస్ శేషాద్రి రెడ్డి, స్నేహ టీ ఐ ప్రాజెక్ట్ స్టాఫ్, ట్రాంజెండర్లు, ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement