Sunday, December 8, 2024

Big Breaking | జనరల్​ ఎలక్షన్స్​ పనులు స్పీడప్​.. రేపు తెలంగాణకు కేంద్ర బృందం రాక

జనరల్​ ఎలక్షన్స్​ కోసం కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ముమ్మరం చేస్తోంది. 2024లో జరగబోయే లోక్​సభ, శాసనసభ ఎన్నికలకు ముందస్తు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా రేపు (బుధవారం) తెలంగాణకు కేంద్ర ఎన్నికల సంఘం బృందం రానున్నట్టు తెలుస్తోంది.

ఇక.. హైదరాబాద్​కు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్​కుమార్​ రానున్నారు. నాలుగు రోజులపాటు హైదరాబాద్​లోనే సీఈసీ రాజీవ్​కుమార్​ ఉండబోతున్నారు. తెలంగాణలో ఓటరు జాబితాలు, ఓటర్ల నమోదుకు సంబంధించిన విషయాలు.. ఎక్కువ కాలం ఒకేచోట ఉన్న అధికారుల బదిలీలకు సంబంధించిన విషయాలపై చర్చించే చాన్స్​ ఉంది. అంతేకాకుండా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశాలున్నాయి.  కాగా, సెప్టెంబర్​లోనే అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్​ వెలువడే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement