Thursday, May 9, 2024

Fun Day: ఒటిటిలో స్ట్రీమ్ కానున్న‌ మూవీస్‌.. వెబ్ సిరీస్‌..

మ‌నీ హైస్ట్‌.. వాల్యూమ్ 2 :
వాల్యూమ్ 1 అయితే.. ఆడియ‌న్స్‌కి చాలా ఇంపాక్ట్ ఇచ్చింది.. మొత్తం 5 ఎపిసోడ్‌లు పూర్తి అయ్యాయి. కంటెంట్ కూడా చాలానే ఉంది. ఫైన‌ల్‌గా సీజ‌న్ 5 వాల్యూమ్ 2 డిసెంబ‌ర్ 3న రిలీజ్ అయ్యింది. స్పానిష్‌, ఇంగ్లిష్ తో పాటు అన్ని రీజ‌న‌ల్ లాంగ్వేజెస్‌లో /ఉంటుంది. దీనికి ఎండ్ కార్డ్ ప‌డ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది.

పుష్ప‌క విమానం..

కామిడీ అండ్ సస్పెన్స్ థ్రిల్ల‌ర్‌.. ఈ మూవీలో ప్ర‌తి క్యారెక్ట‌ర్ ఔట్ స్టాండింగ్ అనే చెప్పొచ్చు. సినిమాలో హీరో పెళ్లి చేసుకున్న కొద్ది రోజుల‌కే అత‌ని భార్య క‌నిపించ‌కుండా పోతుంది. దాంతో అత‌ను చుట్టుప‌క్క‌ల వాళ్లు, త‌న తోటి ఉద్యోగులు, కుటుంబం నుంచి ఎటువంటి స‌మ‌స్య‌లు ఎదుర్కొన్నాడు అనే అంశాలతో పాటు.. మ‌ధ్య మ‌ధ్య‌లో కామెడీ యాడ్ చేశారు.

మంచి రొజులొచ్చాయి.. ఆహా ఒటిటిలో స్ట్రీమ్ అవుతోంది.. చూసి ఎంజాయ్ చేయండి..

- Advertisement -

అర‌ణ్య‌క్‌..

ఇదొక డార్క్ థ్రిల్ల‌ర్‌.. నెట్‌ఫ్లిక్స్ ఒరిజిన‌ల్ మూవీ.. రవీనా టాండన్ లీడ్ రోల్ లో నటించారు. లోకల్ పీపుల్స్ ‘నార్ టెండువా’ అని పిలుచుకునే ఒక అతీంద్రియ శక్తి ద్వారా ఓ బాలిక చనిపోతుందని భావిస్తుంటారు. యుక్తవయసులో ఉన్న ఆ బాలిక డెడ్ బాడీని పరిశీలించిన తర్వాత ఇన్‌స్పెక్టర్ అంగద్ మల్లిక్ షాక్ అవుతాడు. ఇట్లాంటి పలు ఇంట్రెస్టింగ్ అంశాలతో ఈ సిరీస్ ఉంటుంది. నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది చూసి ఎంజాయ్ చేయండి..

ఆర్యా సీజ‌న్ 2..

సీజ‌న్ వ‌న్ ఇప్ప‌టికే డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్ లో ఉంది. ఈ సిరీస్‌లో లేడీ హీరోయిన్ త‌న ఫ్యామిలీని కాపాడుకునేందుకు చేసే డెడ్‌లెస్ వార్ యాక్టివిటీ ఈ కంప్లీట్ సిరీస్‌లో ఉంది. సెకండ్ సీజ‌న్ కూడా ఈ నెల 10 నుంచి అందుబాటులోకి వ‌చ్చింది..

డీక‌పుల్డ్‌:

నెట్‌ఫ్లిక్స్‌లో రొమాన్స్ అండ్ డ్రామా బేస్ మీద నెట్‌ఫ్లిక్స్ ఒరిజిన‌ల్ మూవీస్‌, కొత్త కొత్త సిరీస్‌లు వ‌స్తున్నాయి. అందులో ఒక‌టి డీక‌పుల్డ్. ఇది రొమాన్స్ అండ్ డ్రామా ఆధారంగా ఉండబోతోంది. దీంట్లో లీడ్ రోల్‌లో ఆర్‌. మాధ‌వ‌న్, సుర్వీన్ చోక్లా న‌టిస్తున్నారు. అయితే ఈ సిరిస్ రిలీజ్ డేట్ ఈ నెల 17న ఉండ‌నుంది.

ద విఛ్చ‌ర్ సిజీన్ 2:

మీకు ఫాంట‌సీ, యాక్ష‌న్ సీన్స్ చూడ్డం ఇష్ట‌ప‌డే వారికి ఇదో థ్రిల్లింగ్ అనుభూతిని క‌లిగిస్తుంది. ఇప్ప‌టికే ద విఛ్చ‌ర్ సీజ‌న్ 1 నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. సీజ‌న్ 2 డిసెంబ‌ర్ 17 నుంచి అందుబాటులోకి రానుంది.

డోంట్ లుక్ అప్‌..

కామెడీ అండ్ డిజాస్ట‌ర్ కాన్సెప్ట్‌తో వ‌స్తున్న మూవీ ఇది.. ఈ సినిమాలో లీడ్ రోల్ లో టైటానిక్ హీరో లినార్డో డికాప్రియో న‌టిస్తున్నారు. జెన్నీఫ‌ర్ లారెన్స్ కూడా ఉన్నారు. డిసెంబ‌ర్ 24న నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉండ‌నుంది..

అనుభ‌వించు రాజా..

రాజ్ త‌రుణ్‌, క‌శిష్‌ఖాన్ లీడ్ రోల్‌లో వ‌చ్చిన సినిమా ఇది.. ఈ మ‌ధ్య‌నే రిలీజ్ అయ్యింది క‌దా అప్పుడే ఓటీటీలోకి వ‌స్తోందా అని షాక్ అవ్వ‌కండి.. ఆహా అగ్రిమెంట్ రూల్స్ ప్ర‌కారం దీన్ని త్వ‌ర‌లోనే రిలీజ్ చేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది. డిసెంబ‌ర్ 24న ఆహా ఓటీటీలో రిలీజ్ కానుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్‌బుక్‌,  ట్విట్టర్   పేజీల‌ను ఫాలో అవ్వండి..

www.prabhanews.com

Advertisement

తాజా వార్తలు

Advertisement