Sunday, April 28, 2024

భారీ న‌గ‌దుతో గార్డుల‌కు ప‌ట్టుబ‌డిన – ఉక్రెయిన్ మాజీ ఎంపీ భార్య

ఉక్రెయిన్ పై ర‌ష్యా యుద్ధం ఇంకా కొన‌సాగుతూనే ఉంది. ఈ యుద్ధం ఫ‌లితంగా ఉక్రెయిన్ అంత‌టా 10మిలియ‌న్ల మంది ప్ర‌జ‌లు నిరాశ్ర‌యుల‌య్యారు. వీరిలో దాదాపు 3.4 మిలియన్లు పోలాండ్, స్లోవేకియా, రొమేనియా, హంగేరీ వంటి పొరుగు దేశాలకు పారిపోయారు.అమెరికా నేతృత్వంలోని పాశ్చాత్య దేశాలు రష్యాపై కఠినమైన ఆంక్షలు, ఆర్థిక జరిమానాలు విధించాయి. అయితే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో చర్చలకు తాను సిద్ధంగా ఉన్నానని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ (Zelenskyy) ఆదివారం ప్ర‌క‌టించారు. దౌత్యం విఫలమైతే మూడో ప్రపంచయుద్ధం వస్తుందనే భయాందోళనలను ఆయ‌న వ్య‌క్తం చేశారు. గత రెండేళ్లుగా చర్చలకు తాను సిద్ధంగానే ఉన్నాన‌ని చెప్పారు. చ‌ర్చ‌లు చేప‌ట్ట‌కుండా, సంధి కాకుండా మరో మార్గంలో యుద్ధం ముగుస్తుందని తాను అనుకోవడం లేద‌ని తెలిపారు. ఈ క్ర‌మంలో ఉక్రెయిన్ కు చెందిన మాజీ ఎంపీ (Former MP) భార్య కూడా దేశం విడిచి వెళ్లిపోవాల‌ని భావించారు. కానీ ఆమె వెంట భారీ స్థాయిలో న‌గ‌దును తెచ్చుకుంది. అంత డ‌బ్బుతో స‌రిహ‌ద్దులు దాటే ప్ర‌య‌త్నం చేస్తుండ‌గా ప‌ట్టుబ‌డింది. దీంతో ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. త‌న సూట్ కేసుల్లో 8 మిలియన్ డాలర్లు, 1.3 మిలియన్ యూరోల నగదుతో దేశం విడిచి పారిపోవడానికి ప్రయత్నించింది. జకర్‌పట్టియా ప్రావిన్స్ మీదుగా హంగేరీలోకి ప్రవేశించడానికి ప్ర‌య‌త్నం చేసింది. అయితే ఆమె హంగేరియన్ సరిహద్దులో గార్డుల‌కు ప‌ట్టుబ‌డింది. ఈ విష‌యాన్ని NEXTA మీడియా సంస్థ వెల్ల‌డించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement