Sunday, April 28, 2024

కస్తూర్భాలో పుడ్ పాయిజన్…43 మంది విద్యార్థినీలకు అస్వస్థత

కస్తూర్భా పాఠశాలలో పుడ్ పాయిజన్ కావడంతో 43 మంది విద్యార్థినీలు అస్వస్థతకు గురైన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. అస్వస్థతకు గురైన వారిని మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. గత రాత్రి నుంచే విద్యార్ధులను అస్వస్థతకు గురైనా యాజమాన్యం పట్టించుకోకుండా, విషయం బయటకు పొక్కకుండా డాక్టర్ల ను కస్తూర్భా పాఠశాలలోనే పిలిచి సీక్రెట్ గా వైద్యం అందించే ప్రయత్నం చేశారు.

అయితే సమాచారం బయటకు రావడంతో హుటాహుటిన రెండు కార్లలో మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొంత మంది విద్యార్థినీలు కడుపు నొప్పి బరించలేక అవస్థలు పడుతున్నారు. మరి కొంతమంది విద్యార్ధినీలకు వెంటిలేటర్ మీద శ్వాస అందిస్తున్న పరిస్థితి నెలకొంది. ఆసుపత్రి సిబ్బంది హుటాహుటిన వైద్యం అందిస్తున్నారు. అయితే కస్తూర్భా పాఠశాల యాజమాన్యం విద్యార్ధినీల తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వలేదు. ప్రస్తుతానికి చికిత్స అందిస్తున్నారు… కొన్ని గంటలు గడిస్తే తప్పా చెప్పలేమని డాక్టర్లు చెబుతున్నారు. అస్వస్థతకు గల కారణాలు కలుషిత నీరా……లేక ఆహారమా అనేది తెలియాల్సి ఉంది. ఈ సంఘటన పై పలు విద్యార్థి సంఘాలు భగ్గుమంటున్నాయి. చికిత్స పొందుతున్న విద్యార్థులను ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, మహబూబాబాద్ మున్సిపల్ కమిషనర్ పరామర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement