Thursday, May 9, 2024

దేశంలో ఫ్లూ పంజా – తీసుకోవ‌ల‌సిన జాగ్ర‌త్త‌లు..

న్యూఢిల్లి: సీజన్‌ మారింది.. వేసవి సెగలు మొదలవుతున్నాయి. అదే సమయంలో వైరల్‌ జ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయి. జలుబు, దగ్గు లక్షణాలతో కలగలిసిన ఈ జ్వరాలు ప్రజలు ఒకింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. కొవిడ్‌ తరహా లక్షణాలుండటం పట్ల భయాందోళనలు కలుగుతున్నాయి. ఈ రకమైన ఇన్‌ఫ్లూ యంజా కేసులు గత కొద్దిరోజులుగా పెరుగుతున్నాయి. దీంతో మళ్లిd కరోనా కొత్త వేరియంట్‌ ఏమైనా ప్రవేశించించా అనే ఆందోళనలు తలెత్తుతున్నాయి. ఇన్‌ఫ్లూయెంజా ఎ ఉపకారకం హెచ్‌3ఎన్‌2 అనే వైరస్‌ కారణంగా అనేక మంది శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌), ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఎ) వెల్లడించింది. గత రెండు మూడు నెలలుగా ఈ విధమైన ఫ్లూ కేసులు పెరుగుతున్నాయని, ఇతర ఉప వేరియంట్లతో పోల్చితే ఈ హెచ్‌3న్‌2 రకం ఆస్పత్రిలో చేరికలను పెంచుతున్నట్లు తేలింది. ఎడతెరపి లేకుండా దగ్గు, జ్వరంతోపాటు శ్వాసపీల్చుకోవడంలో సమస్యలు అనేవి ఈ ఇన్‌ఫ్లూయెంజా ప్రధాన లక్షణాలు. వీటితోపాటు వాంతులు, గొంతునొప్పి, ఒళ్లునొప్పులు, విరేచనాలు వంటి లక్షణాలు కొందరిలో గుర్తించినట్లు ఐఎంఏ ఒక ప్రకటనలో వెల్లడించింది.

యాంటీబయాటిక్స్‌ అవసరం లేదు: ఐఎంఏ
జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు, వికారం, వాంతులు, జ్వరం ఇవన్నీ సాధారణమే. సీజనల్‌ జ్వరం ఐదు నుంచి ఏడు రోజుల వరకు ఉంటుంది. సాధారణ జ్వరం మూడు రోజుల్లో తగ్గిపోతుంది. అయితే దగ్గు మాత్రం మూడు వారాల వరకు ఉంటుంది. రోగులకు యాంటీబయాటిక్స్‌ ఔషధాలు సూచించే ముందు సదరు ఇన్ఫెక్షన్‌ బ్యాక్టీరియా వల్ల వచ్చిందా? కాదా? అన్నది వైద్యులు నిర్ధారించుకోవాలి. లక్షణాల ఆధారంగా చికిత్స ఇవ్వాలని పేర్కొంది. ఈ దగ్గు, జలుబు వంటి వాటికి యాంటీబయాటిక్స్‌ అవసరం లేదు అని ఐఎంఏ స్పష్టంచేసింది. అయితే సంబంధిత లక్షణాలు లేనప్పటికీ వైద్యులు ఎక్కువగా యాంటీబయాటిక్స్‌ సూచిస్తుండటాన్ని ఐఎంఏ తప్పుబట్టింది. డయేరియాకు కూడా వైద్యులు యాంటీబయాటిక్స్‌నే ఇస్తున్నారని తెలిపింది. 70 శాతం డయేరియా (నీళ్ల విరేచనాలు / అతిసారం) కేసులు వైరల్‌ వల్ల వస్తున్నవని పేర్కొంది. అమోక్సిసిల్లిన్‌, నార్‌ ప్లnాక్సాసిల్లిన్‌, సిప్రోప్లnాక్సాసిల్లిన్‌, ఓప్లnాక్సాసిల్లిన్‌, లెవోప్లnాక్సాసిల్లిన్‌.. వీటిని దుర్వినియోగం చేస్తున్నట్టు ప్రస్తావించింది

తీసుకోవ‌ల‌సిన జాగ్ర‌త్త‌లు

చేతులను తరచూ సబ్బు, నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఫ్లూ లక్షణాలు తీవ్రంగా ఉంటే మాస్కు ధరించాలి.. రద్దీ ప్రదేశాల్లో తిరగొద్దు

- Advertisement -

నోరు, ముక్కును పదేపేదే తాకకూడదు.

దగ్గుతున్నప్పుడు, ముక్కు కారుతున్నప్పుడు ఇతరులకు దూరంగా ఉండాలి.

శరీరంలో నీటి శాతం తగ్గుకుండా చూసుకోవాలి. ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.

జ్వరం, ఒళ్లునొప్పుల తీవ్రత ఎక్కువగా ఉంటే పారాసిటమాల్‌ తీసుకోవాలి.

కరచాలనం, ఆలింగనం వంటి చర్యలకు దూరంగా ఉండాలి.

ఒకరికొకరు దగ్గరగా కూర్చుని ఆహారపదార్థాలు భుజించకూడదు.

వైద్యుల సూచన మేరకే యాంటిబయోటిక్స్‌ లేదా ఇతర ఔషధాలు తీసుకోవాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement