Tuesday, May 21, 2024

వరద ఉద్ధృతికి 8ఇళ్లు ధ్వంసం..

యు కొత్తపల్లి: వాయుగుండం,పౌర్ణమి ప్రభావంతో ఉప్పాడ సముద్రతీరంలో అలజడి రేపుతున్నాయి.శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఈదురు గాలులు, అనంతరం ఉదయం వరకు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దీంతో ఉప్పాడ,కొత్తపల్లి, సుబ్బంపేట,సూరాడపేట, కీస్తూనగరం,వాకతిప్ప తదితర గ్రామాల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. వర్షం కారణంగా భవన నిర్మాణ కార్మికులు పనులు లేక ఇళ్లకే పరిమితమయ్యారు. మరోపక్క ఉప్పాడ సముద్ర తీరంలో అలలు మత్స్యకారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.సుబ్బంపేట నుండి ఎస్పీజీఎల్ శివారు వరకు సముద్రపు అలలు బీచ్ రోడ్డుపై పడుతున్నాయి.బీచ్ రోడ్డు కోతకు గురికాకుండా వేసిన రివిట్మెంట్ రాళ్లు అలల తాకిడికి సముద్రంలో కలిసిపోతున్నాయి.తీరప్రాంతం కోతకు గురికాకుండా వేసిన జియో ట్యూబ్ పలుచోట్ల ధ్వంసమైంది. మాయాపట్నం,సూరాడపేటలో సముద్రం మరింత ఎగసి పడుతుంది.దీంతో తీర ప్రాంతంలో మత్స్యకారులు నివసించే 8 ఇళ్లు ధ్వంసమయ్యాయి.

జగ్గరాజుపేట లో అలల తాకిడికి తీర ప్రాంతం కోతకు గురైంది.గ్రామంలో ఉన్న సిమెంట్ రోడ్లు కొట్టుకుపోవడంతో పాటు,2ఇళ్లు ధ్వంసమయ్యాయి. తుఫానులు ప్రభావం కన్నా, సముద్రం ఆటుపోటుల తీవ్రత వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని మత్స్యకారులు వాపోతున్నారు. ప్రతి ఏడాది తుపానుల ప్రభావంతో ఆస్తి నష్టం ఎక్కువగా వాటిల్లుతుందని మత్స్యకారులు చెబుతున్నారు.ఎక్కువ శాతం తాము నివసించే గృహాలు సముద్ర గర్భంలో కలిసి పోవడంతో అధికంగా నష్టపోతున్నామన్నారు. తక్షణమే తీర ప్రాంత గ్రామాలు కోతకు గురికాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని మత్స్యకారులు కోరుతున్నారు. ఉప్పాడ కాకినాడ బీచ్ రోడ్డులో ఉన్న రెండు బిడ్జి వద్ద అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతు న్నాయి. దీంతో బీచ్ లో ప్రయాణం చేసే వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు.అదేవిధంగా కోనపాపపేటలో సముద్రపు అలలు విరుచుకుపడుతున్నాయి.దీంతో తీర ప్రాంతంలో నివసించే మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు,తుపాను హెచ్చరికల నేపథ్యంలో మత్స్యకారులు వేట నిలుపుదల చేశారు.బోట్లన్నీ రామన్నపాలెం బిడ్జివద్ద, అమీనాబాద్ రేవులో నిలుపుదల చేశారు.అయితే కొందరు మత్స్యకారుల వేటకు వెళ్లినట్టు తెలిసిందని,వారు తక్షణమే తిరిగిరావాలని,కొత్తపల్లి తహశీల్దార్ ఎల్ శివకుమార్ అందజేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement