Saturday, May 4, 2024

పంది గుండె అమ‌ర్చిన వ్య‌క్తి మృతి

రెండు నెల‌ల క్రితం అమెరికాలోని మేరీలాండ్ ఆస్ప‌త్రిలో గుండె మార్పిడి జ‌రిగింది. ప్ర‌పంచ వైద్య చ‌రిత్ర‌లోనే మొట్ట మొద‌టిసారిగా పంది గుండెనే స‌ర్జ‌రీ ద్వారా అమర్చారు డేవిడ్ బెన్నెట్ అనే వ్య‌క్తికి. ఆయ‌న వ‌య‌సు 57సంవ‌త్స‌రాలు. అవయవాల మార్పిడిలో కీలకమైన ముందడుగుగా ఈ శస్త్రచికిత్సలు భావించారు. కాగా కొద్దిరోజులుగా అతని ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చిందని, ఆయ‌న తుది శ్వాస విడిచారని ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. అయితే మరణానికి కచ్చితమైన కారణాన్ని వివరించలేదు. వివిధ రుగ్మతలతో చావుకు దగ్గరగా ఉన్న తన తండ్రికి ఈ ఏడాది జనవరి 7న అరుదైన గుండె మార్పిడి చికిత్స జరిగిందని, తద్వారా ఆయనను బతికించేందుకు ఆసుపత్రి వైద్యులు అపూర్వమైన కృషి చేశారని డేవిడ్ బెన్నెట్ కుమారుడు బెన్నెట్ జూనియర్ ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో జంతువుల అవయవాలను అమర్చిన ప్రయోగాలు విఫలమయ్యాయి. దీంతో మేరీల్యాండ్ మెడికల్ సెంటర్ ఆసుపత్రి వైద్యులు జన్యుమార్పిడి చేసిన పంది నుంచి సేకరించిన గుండెను డేవిడ్ బెన్నెట్ కు అమర్చారు. 1984 లో ఒక రకం కోతి గుండెను బేబీ ఫే అనే వ్యక్తికి అమర్చగా 21 రోజులు మాత్రమే జీవించారు. ఆ శస్త్ర చికిత్సతో పోల్చితే డేవిడ్ బెన్నెట్ పై జరిగిన ప్రయోగం మెరుగైన ఫలితాలను సాధించింది అని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement