Wednesday, May 1, 2024

ఏడు అంత‌స్తుల భ‌వ‌నంలో భారీ అగ్నిప్ర‌మాదం..

ఓ ఏడు అంత‌స్తుల భ‌వ‌నంలో పెద్ద ఎత్తున మంట‌లు చెల‌రేగాయి. దాంతో వందమంది అగ్నిమాప‌క సిబ్బంది మంట‌ల‌ను అదుపు చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.ఈ సంఘ‌ట‌న‌ ఆస్ట్రేలియా లోని సిడ్నీ లో గురువారం చోటు చేసుకుంది. నగరంలోని సర్రీ హిల్స్ లో 7 అంతస్తుల భవంతిలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అవి పక్కనున్న భవనాలకు కూడా వ్యాపిస్తున్నాయి. భారీ ఎత్తున మంటలు ఎగసిపడుతుండటంతో.. చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టంగా పొగ అలముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 100 మంది అగ్నిమాపక సిబ్బంది 20 ఫైర్‌ ఇంజన్లతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మంటల ధాటికి భవనం పూర్తిగా కాలిపోయి కూప్పకూలిపోయినట్లు అధికారులు వెల్లడించారు. అగ్నిమాపక కార్యకలాపాలు కొనసాగుతున్నందున ఈ ప్రాంతంలోకి ప్రజలు ఎవరూ రావొద్దని అధికారులు వెల్ల‌డించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement