Friday, May 3, 2024

ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుక‌ర్ బ‌ర్గ్ పై ఎఫ్ ఐ ఆర్ .. ఎందుకో తెలుసా ..

ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుక‌ర్ బ‌ర్గ్ పై ఎఫ్ ఐ ఆర్ న‌మోద‌యింది. ఈ సంఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో చోటు చేసుకుంది. యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాద‌వ్ పై అభ్యంత‌ర‌క‌ర పోస్ట్ కి సంబంధించి ఘ‌ట‌న‌లో మార్క్ పై ఎఫ్ ఐఆర్ న‌మోద‌వ్వ‌డం విశేషం..విష‌యం ఏంటంటే ఈ పోస్ట్ ని మార్క్ పోస్ట్ చేయ‌లేదు కానీ మెస్సేజ్ పోస్ట్ అయింది ఫేస్ బుక్ కాబ‌ట్టి ఆ సంస్థ సీఈవోపై ఓ వ్య‌క్తి ఫిర్యాదు చేయ‌డం వైర‌ల్ అయింది. కన్నౌజ్ జిల్లా సారహతి గ్రామానికి చెందిన అమిత్ కుమార్ ఈ మేర‌కు ఫిర్యాదు చేశారు. ఈయన ఫిర్యాదుతో మొత్తం 49 మందిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. సమాజ్ వాదీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ప్రతిష్టను దెబ్బ తీయాలనే లక్ష్యంతోనే వారు పోస్టు పెట్టారని అమిత్ కుమార్ ఆరోపించారు.

బువా బబువా అనే టైటిల్‌తో ఫేస్‌బుక్‌లో పేజీ క్రియేట్ చేశారని కోర్టుకి తెలిపారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యర్థులుగా పేరుగాంచిన బీఎస్పీ చీఫ్ మాయవతి, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్‌లు 2019 పార్లమెంటరీ ఎన్నికల కోసం జట్టు కట్టినప్పుడు వారిద్దరినీ ఎగతాళిగా బువా బబువా అనే పదం కాయిన్ చేసినట్టు తెలిసింది. ఈ కేసులో దర్యాప్తు మొదలైన తర్వాత ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ పేరును పోలీసులు తీసివేశారు. ఇప్పుడు ఆ ఫేస్‌బుక్ పేజీ అడ్మినిస్ట్రేటర్‌పై దర్యాప్తు జరుగుతున్నట్టు జిల్లా సీనియర్ పోలీసు అధికారి వివరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement