Wednesday, May 15, 2024

ఆర్థికంగా బాగుండాలంటే గట్టి నిర్ణయాలే ఉంటయ్​.. యూకే ప్రధాని రుషికి అభినందనల వెల్లువ

దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలంటే కఠిన నిర్ణయాలు తప్పవని బ్రిటన్‌ కొత్త ప్రధాని రిషి సునాక్‌ స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరి అవసరాలను తీరుస్తానని హామీ ఇచ్చారు. ఉన్నత స్థాయి నుంచి క్షేత్రస్థాయి దాకా అంతటా ప్రొఫెషనలిజంతో కూడిన, పారదర్శకమైన అకౌంటబిలిటీ ఉంటుందన్నారు. ప్రభుత్వ సంస్థల్లో ఆర్థిక సుస్థిరత తీసుకొస్తానని పేర్కొన్నారు. మంగళవారం బ్రిటన్‌ ప్రధానిగా ప్రమాణం చేసిన తర్వాత అధికార నివాసరం డౌనింగ్‌ స్ట్రీట్-10 నుంచి రిషి సునాక్‌ మాట్లాడారు. ప్రస్తుతం బ్రిటన్‌ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఆర్తిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.

మాజీ ప్రధాని లిజ్‌ ట్రస్‌ హయాంలో జరిగిన పొరపాట్లను చక్కదిద్దుతానని రిషి స్పష్టం చేశారు. ఆర్థిక సుస్థిరత, విశ్వాసం కల్పించడమే తమ ప్రభుత్వ ఏజెండా అని అన్నారు. తక్షణం తమ ప్రభుత్వ పనితీరు మొదలవుతుందని వెల్లడించారు. రిషి సునక్​ యూకే ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా తన అత్తగారు అయిన సుధామూర్తి ట్విట్టర్​ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

ఆంధ్రప్రభలో ప్రచురితమైన ప్రత్యేక కథనం
Advertisement

తాజా వార్తలు

Advertisement