Monday, April 29, 2024

ఉక్రెయిన్, ర‌ష్యా వార్ ముగియాల‌ని ట్వీట్ చేసిన హీరో రామ్

ర‌ష్యా, ఉక్రెయిన్ మ‌ధ్య జ‌రుగుతోన్న యుద్ధంపై స్పందించాడు హీరో రామ్. ఈ మేర‌కు ట్విట్ట‌ర్ లో స్పందించారు. యుద్ధంలో పోరాడేందుకు ఇతర దేశాలు నేరుగా తమ సైన్యాన్ని పంపడం సరైన చర్య కాకపోవచ్చు. కానీ, తమ పౌరులను సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చేందుకు సరైన విధంగా తమ డ్యూటీ నిర్వర్తించాల్సింద‌ని ట్వీట్ చేశాడు. ఉక్రెయిన్ – రష్యా వార్ త్వరగా ముగియాలని, ఉక్రెయిన్ లో ఉన్న ఇండియన్స్ సురక్షితంగా ఉండాలని ఆకాంక్షించాడు. బాధితుల కోసం ప్రేయర్ చేయాలని సూచించాడు. ఇక రామ్ పోతినేని ఇస్మార్ట్ శంకర్, రెడ్ సినిమాల తర్వాత తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో ‘ది వారియర్’ మూవీలో నటిస్తున్నారు. పవర్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న రామ్ తన న్యూ లుక్ తో ఫ్యాన్స్ ను షాక్ కు గురిచేస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement