Tuesday, May 7, 2024

వ్యవసాయ చట్టాలు రద్దు: రైతుల ఆందోళనతో దిగొచ్చిన కేంద్రం

మూడు వ్యవసాయ చట్టాలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతుల ఆందోళనతో వ్యవసాయ చట్టాలపై వెనక్కి తగ్గింది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ సంచలన ప్రకటన చేశారు. ఇవాళ జాతిని ఉద్దేశించి మోడీ ప్రశంగించారు. ఈ సందర్భంగా ఆయన వ్యవసాయ చట్టాలపై కీలక ప్రకటన చేశారు.

రైతులకు క్షమపణలు చెప్పారు మోదీ. రైతులను ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించాలని కోరారు. మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. కాగా, ప్రధాని మోడీ ప్రకటనతో దేశ వ్యాప్తంగా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కాగా, కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై దేశవ్యాప్తంగా రైతులు వ్యతిరేకించారు. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ తో పాటు ఉత్తర భారతంలో పలు రాష్ట్రాల్లో ఈ చట్టాలను రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఢిల్లీ శివార్లలో పంజాబ్ రైతులు ఏడాదికి పైగా నిరవధికంగా ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు గురునానక్ జయంతి సందర్భంగా మోదీ కీలక ప్రకటన చేశారు. కాగా, వచ్చే ఏడాడి ఉత్తరప్రదేశ్,పంజాబ్ తోపాటు పలు రాష్ట్రాలకు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో వ్యవసాయ చట్టాలపై ప్రధాని మోదీ ప్రకటన చేయడం గమనార్హం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement