Saturday, May 25, 2024

కేటీఆర్ టూర్​లో ఫ్యాన్సీ నెంబర్‌ కార్‌.. కేసీఆర్‌, కేటీఆర్‌ అభిమానులు సందడి

యూకే పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్‌కు పలుచోట్ల వైవిధ్యమైన నంబర్‌ప్లేట్‌ కార్లతో స్వాగతం పలుకుతున్నారు. గురువారం ‘టీఆర్‌ఎస్‌-కేటీఆర్‌’ అని ఆంగ్ల అక్షరాల్లో కనిపించేలా నంబర్‌ప్లేట్‌ ఉన్న వాహనంలో కేటీఆర్‌ను టీఆర్‌ఎస్‌ ఎన్నారై సెల్‌ యూకే అధ్యక్షుడు అశోక్‌ దూసరి రైడ్‌కు తీసుకెళ్లగా.. ‘వీ ఫర్‌ కేసీఆర్‌’ అనే ఫ్యాన్సీ నెంబరు కారు మంత్రి పర్యటనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వాహనం ఫొటోను తెలుగు రాష్ర్టాల బ్రిటిష్‌ డిప్యూటీ హైకమిషర్‌ అండ్రూ ఫ్లెమింగ్‌ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. నంబర్‌ ప్లేట్ల ఎంపికలో ప్రత్యేక అభిరుచిని చూపేవారికి యూకేలో కొదువలేదని, కేటీఆర్‌ పర్యటనలో ఇలా ‘మద్దతు’గా వస్తున్న వాహనాలు చూస్తే ముచ్చటేస్తున్నదని ఆయన ట్వీట్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement