Tuesday, May 7, 2024

ఎఫ్3 ట్రైల‌ర్ రిలీజ్ డేట్ వ‌చ్చేసింది

ఎఫ్3 చిత్ర ట్రైలర్ ను ఈ నెల 9న 10.08 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ నెల 27న ఈ ఫిల్మ్ రిలీజ్ కానుంది. ఇక ఈ చిత్రంలో సర్ ప్రైజ్ ఎలిమెంట్ ప్లాన్ చేశారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే ఈ సినిమాలో ఐటెం సాంగ్ చేసింది. ఈ సాంగ్ తో జనం ఊగిపోతారని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా,తమన్నా భాటియా, మెహరిన్ పిర్జాదా హీరోయిన్‌‌‌‌లుగా కలిసి నటించిన చిత్రం ఎఫ్3. దిల్ రాజు ప్రొడక్షన్‌లో తెరకెక్కిన ఈ పిక్చర్ కు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement