Friday, May 17, 2024

ఇది వంచ‌న – ఇది బిజేపి నిజ‌రూపం – నెటిజ‌న్స్ కి జ‌వాబు ఇచ్చిన మంత్రి కేటీఆర్

సోష‌ల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటారు మంత్రి కేటీఆర్. కాగా ట్విట్ట‌ర్ లో ప్ర‌జ‌లు అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు జ‌వాబు ఇచ్చారాయ‌న‌.ఈ సంద‌ర్భంగా ప‌లువురు కేంద్ర ప్ర‌భుత్వ తీరు గురించి కేటీఆర్‌ను ప్ర‌శ్నించారు. యూపీఏ ప్ర‌భుత్వ హ‌యాంలో వంట గ్యాస్ ధ‌ర రూ.50 పెరిగిన నేప‌థ్యంలో అప్ప‌ట్లో స్మృతి ఇరానీ బీజేపీ నేత‌ల‌తో క‌లిసి ధ‌ర్నాకు దిగిన ఫొటోను ఓ నెటిజ‌న్ పోస్ట్ చేసి దీనిపై స్పందించాల‌ని కోరారు. దీంతో కేటీఆర్ స్పందిస్తూ ‘వంచ‌న’ అని స‌మాధానం ఇచ్చారు. కర్ణాటకలో సీఎం కావాలంటే రూ.2,500 కోట్లు అడుగుతున్నారంటూ వ‌చ్చిన ఓ వార్త‌ను పోస్ట్ చేస్తూ ఓ నెటిజ‌న్ దానిపై స్పందించాల‌ని కేటీఆర్‌ను అడిగాడు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ… ‘బీజేపీ నిజ రూపం ఇదే’ అంటూ స‌మాధానం ఇచ్చారు. బీఆర్ఎస్ కోసం తాము 2017లో డ‌బ్బులు క‌ట్టామ‌ని, ఇప్ప‌టి వ‌ర‌కు ఆమోదం పొంద‌లేద‌ని ఓ నెటిజ‌న్ పేర్కొన్నాడు. దానిపై కేటీఆర్ స్పందిస్తూ.. బీఆర్ఎస్ అంశం హైకోర్టు ప‌రిధిలో ఉంద‌ని తెలిపారు. అలాగే, నెటిజ‌న్లు అడిగిన ప‌లు ప్రశ్న‌ల‌కు కేటీఆర్ స‌మాధానం ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement