Sunday, April 28, 2024

‘ద క‌శ్మీర్ ఫైల్స్’ చిత్రాన్ని ప్ర‌తీ భార‌తీయుడు చూడాల్సిందే – అమీర్ ఖాన్

ప్ర‌తి భార‌తీయుడు క‌శ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని చూడాల‌ని పిలుపునిచ్చారు బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్. ఈ సినిమా ఈ నెల 11న విడుదల కాగా, నాటి నుంచి ప్రతి రోజూ బాక్సాఫీసు కలెక్షన్లలో రికార్డులు సృష్టిస్తూ వెళుతోంది. 1990లలో కశ్మీర్ లో పండిట్లపై జరిగిన దారుణలను ఈ సినిమాలో దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి కళ్లకుకట్టినట్టు చూపించారు. బాలీవుడ్ కమ్యూనిటికీ చెందిన పలువురు ఇప్పటికే ఈ సినిమాకు అనుకూలంగా స్పందించడం గమనార్హం. వీరికి తాజాగా ఆమిర్ ఖాన్ జత కలిశారు. ఢిల్లీలో ఆర్ఆర్ఆర్ సినిమా ఈవెంట్ సందర్భంగా కశ్మీర్ ఫైల్స్ సినిమాపై స్పందన అడగ్గా.. ‘‘నిజమే, నేను తప్పకుండా ఈ సినిమాను చూస్తాను. ఈ సినిమా కథ చరిత్రలో భాగం. కశ్మీరీ పండిట్ల విషయంలో జరిగింది నిజంగా విచారకరం. అటువంటి అంశంతో కూడిన ఏ సినిమాను అయినా భారతీయులు అందరూ చూడాలి. మానవత్వాన్ని నమ్మే ప్రతి ఒక్కరి భావోద్వేగాలను ఈ సినిమా కదిలించింది. ఈ సినిమాలో ఉన్న అందమైన అంశం అదే. నేను తప్పకుండా ఈ సినిమాను వీక్షిస్తా. ఈ సినిమా విజయం సాధించినందుకు హ్యాపీగా వుంద‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement