Sunday, June 4, 2023

ఎవ‌రు మీలో కోటీశ్వ‌రుడుకి గెస్ట్ గా మ‌హేశ్..క‌న్ఫామ్..

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఎవ‌రు మీలో కోటీశ్వ‌రుడు షోతో బుల్లితెర‌పై తెగ సంద‌డి చేస్తున్నారు. ఈ షోకి ప‌లువురు సెల‌బ్రిటీలు గెస్ట్ గా వ‌స్తున్నారు. కాగా టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు ఈ షోకి గెస్ట్ గా రానున్నార‌ని కొద్దిరోజుల క్రితం వార్త‌లు వ‌చ్చాయి.కాగా మహేశ్ బాబు, తారక్ తో కలిసి సందడి చేయనున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో సదరు ఛానెల్ అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చింది. మహేష్ గెస్ట్ గా రాబోతున్న షోకు సంబంధించిన ఒక పోస్టర్ ను విడుదల చేశారు. త్వరలోనే ఈ ఎపిసోడ్ ప్రసారం కానుందని ప్రకటించారు. దాంతో తారక్ ఫాన్స్ , మహేష్ ఫాన్స్ ఈ ఎపిసోడ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఇద్ద‌రు స్టార్స్ ఒకే వేదిక‌పై సంద‌డి చేయ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement