Friday, April 26, 2024

ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు.. పనులు స్పీడప్ చేస్తున్న ప్రభుత్వం..

ప్ర‌భ‌న్యూస్: ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఉప్పుడు బియ్యాన్ని కొనుగోలు చేయబోమని స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ సమస్యకు అంతిమ పరిష్కారం ప్రత్యామ్నాయ పంటలు పండించడంతో పాటు వాటికి విలువ జోడించి ప్యాకేజ్డ్‌ ఫుడ్‌ తయారు చేయడమేనని చెబుతున్నారు. ఇందుకు తగ్గట్లుగా తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్‌ఐఐసీ) అన్ని ఉమ్మడి జిల్లాల్లో ఈ జోన్‌ల ఏర్పాటుకు భూ సేకరణ ప్రారంభించడంతో పాటు కొన్ని జిల్లాల్లో ఇప్పటికే భూ సేకరణ పూర్తి చేసి జోన్‌ల అభివృద్ధి కూడా ప్రారంభించింది. ఎస్‌ఎఫ్‌పీజెడ్‌లలో పరిశ్రమల ఏర్పాటుకు ఎక్కువ ఆసక్తి వ్యక్తీకరణ దరఖాస్తులు వచ్చిన జగిత్యాల, కరీంగనర్‌, నల్గొండ లాంటి ప్రాంతాల్లో ముందుగా ఎస్‌ఎఫ్‌పీజెడ్‌లను ప్రారంభించనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

ఈ జోన్‌లలో ఆయా పరిశ్రమలకు ల్యాండ్‌ అలాట్‌మెంట్‌ ప్రస్తుతం పరిశీలనలో ఉందని, త్వరలో ప్రభుత్వ అనుమతితో స్థలాలు కేటాయిస్తామని టీఎస్‌ఐఐసీ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ప్రత్యేక ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్‌లలో పరిశ్రమల ఏర్పాటుకు వచ్చిన ఆసక్తి వ్యక్తీకరణ దరఖాస్తుల్లో ఎక్కువ భాగం రైస్‌మిల్లుల ఏర్పాటుకు సంబంధించినవేనని వారు పేర్కొంటున్నారు. అయితే ధాన్యం పండించే రైతుకు గిట్టుబాటు అయ్యేలా ధాన్యం పొట్టు నుంచి వంట నూనెలు తయారు చేసే రైస్‌ బ్రాన్‌ ఆయిల్‌ మిల్లుల ఏర్పాటును కూడా తాము ప్రోత్సహిస్తున్నామని చెబుతున్నారు. ఈ జోన్ల ఏర్పాటు ద్వారా సుమారు రూ.25 వేల కోట్ల పెట్టుబడిని ఆకర్షించి, 70 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి, 3 లక్షల మందికి పరోక్ష ఉపాధిని కల్పించాలనేది ప్రభుత్వ ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement