Sunday, May 5, 2024

ట్విట్టర్ నుండి వైదొలిగిన ఎలాన్ మస్క్ మాజీ లవర్.. హాలీవుడ్ నటి అంబర్ హెర్డ్

ఇటీవల తన మాజీ భర్త జానీడెప్ తో కోర్టు వివాదంలో ఓడిపోయింది హాలీవుడ్ నటి అంబర్ హెర్డ్. తాజాగా ట్విట్టర్ లో తన ఖాతాను డిలీట్ చేసేసింది. అంబర్ హెర్డ్ ఒకప్పుడు టెస్లా, ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ తో కొంత కాలం పాటు సహ జీవనం చేశారు. ఆ తర్వాత వారు ఎవరి దారి వారు చూసుకున్నారు. తాజా పరిణామం ఏమిటంటే.. ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేయడం తెలిసిందే. దీంతో ట్విట్టర్ లో తన ఖాతా కొనసాగించడం అంబర్ కు నచ్చలేదేమో, ఆమె తన ఖాతాను తొలగించుకుంది. అయితే పూర్తిగా డిలీట్ చేసిందా? లేక ఆమె ఇనాక్టివ్ లో ఉంచిందా..? లేక అంబర్ అకౌంట్ ను ఎలాన్ మస్క్ డీయాక్టివేట్ చేశాడా? అన్నవి ఇప్పుడు నెటిజన్ల మదిలో తలెత్తుతున్న ప్రశ్నలు ఇవి. ఎలాన్ మస్క్ మాజీ ప్రియురాలైన అంబర్ ట్విట్టర్ ఖాతా ఉందా అన్న సందేహం కొందరికి రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement