Tuesday, May 21, 2024

Election Campaign – ఈ నెల 20వ తేది త‌ర్వాత కెసిఆర్ జిల్లాల‌లో ప‌ర్య‌ట‌న

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే పార్టీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటనకు ముందే ఒక విడత జిల్లాల పర్యటనలకు వెళ్లి రావాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. తన జిల్లాల పర్యటనలకు సంబందించిన తేదీలు, కార్యక్రమాలను ఖరారు చేయడంతో పాటు ఏర్పాట్లను పర్యవేక్షిం చాలని ఆయన తన కార్యాలయ ఉన్నతాధికారాలను ఆదేశించినట్టు సమాచారం. ఈ నెల 20వ తేదీ తర్వాత వరుసగా పదిరోజుల పాటు ఆయా జిల్లాల్లో పర్యటిం చేందుకు కేసీఆర్‌ సమాయత్తమవుతున్నట్టు చెబు తు న్నారు. రెండో విడత జిల్లాల పర్యటనలను సెప్టెంబర్‌ నెలలో ఉండే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అసెంబ్లిd ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించక ముందే రాష్ట్రం లో పది నుంచి పదిహను జిల్లాలను చుట్టి రావాలని కేసీఆర్‌ ప్రణాళిక సిద్ధం చేశారని భారాస వర్గాలు చెబు తున్నాయి. విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం తొలి విడతలో సూర్యాపేట, మెదక్‌, నల్గొండ, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, ములుగు జిల్లాల్లో సీఎం పర్యటించే అవ కాశాలున్నాయి. సీఎం తన జిల్లాల పర్యటనలో కొత్త కలెక్టరేట్‌, జిల్లా పొలీస్‌ సమీకృత భవనాలతో పాటు జిల్లా భారాస పార్టీ కార్యాలయాల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అక్కడే స్థానిక జిల్లా నాయకత్వం ఏర్పాటు చేసే బ#హరంగ సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు.

జిల్లా అధికారులతో సమీక్ష
ఈ దఫా జిల్లాల పర్యటనల్లో సీఎం కేసీఆర్‌ కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టాలని ప్రతిపాదిం చిన ట్టు ప్రచారం జరుగుతోంది. జిల్లాలకు వెళ్లిన సమ యంలో ఆ జిల్లాకు చెందిన అన్ని ప్రభుత్వ శాఖల అధి కారులు, జిల్లా కలెక్టర్‌ సంయుక్త కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహంచి ప్రభుత్వ పథకాలు, కార్య క్రమాల అమలుపై ఆరా తీయనున్నట్టు చెబు తు న్నారు. ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన గృహలక్ష్మి, బీసీలకు మైనార్టీలకు లక్ష రూపాయల ఆర్థిక సాయంపై కూడా సమీక్షించనున్నారు. రెండు పడక గదుల ఇళ్ల కు సంబంధించి కూడా తన జిల్లాల పర్యటనలో కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం జరు గుతోంది. ఎన్నికలు సమీపిస్తుండడంతో తాను పాల్గొనే బహరంగసభల్లో ప్రజలకు తాయిలాలు ప్రకటిస్తారని భావిస్తున్నారు. ఎన్నికల ప్రణాళికల్లో పొందుపరచని కొన్ని హామీలను సీఎం కేసీఆర్‌ బహరంగ సభల్లో ప్రక టించే అవకాశం ఉందని భారాస నేతలు భావిస్తు న్నా రు. కేసీఆర్‌ ఈ దఫా చేపట్టే జిల్లాల పర్యటనలను ఇటు అధికార యంత్రాంగం అటు మంత్రులు, ఎమ్యె ల్యేలు స్థానిక ప్రజాప్రతినిధులు ప్రతిష్టాత్మకంగా తీసు కుంటు న్నారు. జూన్‌ ఆఖరు వారంలో ఆసిఫాబాద్‌ జిల్లా పర్య టనకు వెళ్లిన కేసీఆర్‌ అక్కడ ఏర్పాటు చేసిన అధికార కార్యక్రమాలతోపాటు బహరంగ సభలో పాల్గొ న్నా రు. జులైలో జిల్లాల పర్యటనలకు వెళ్లాలని భావిం చి నా భారీ వర్షాల వల్ల అవి వాయిదా పడుతూ వచ్చాయి.

పార్టీ బలోపేతం నాయకుల మధ్య తగవులపై దృష్టి
అసెంబ్లిd ఎన్నికల్లో పోటీ చేసేందుకు కొన్ని నియో జకవర్గాల్లో ఆశావ#హుల సంఖ్య భారీగా పెరగడంతో పాటు నేతలు పోటాపోటీ సమావేశాలు నిర్వహస్తూ బలప్రదర్శనకు దిగుతున్న ఘటనలు పార్టీకి నష్టం కలిగిస్తున్నాయని కేసీఆర్‌ భావిస్తున్నారు. ఇటువంటి చర్యలకు దిగుతున్న వారిని కట్టడి చేయాలన్న నిర్ణ యానికి ఆయన వచ్చినట్టు సమాచారం. జిల్లాల పర్య టనలో ఆశావ#హులతో పాటు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు స్థానిక ప్రజాప్రతినిధులను సమావేశ పరిచి సమన్వయం చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీ అధినాయకత్వం ఎన్నికల్లో ఎవరిని నిలబెట్టినా అందరూ సమిష్టిగా పనిచేసి సదరు నేతను గెలిపించాలని కేసీఆర్‌ ఆదేశించనున్నారు పోటీ చేసే అవకాశం రాని వారిని పార్టీ కడుపులో పెట్టుకుని చూసుకుంటుందని వారి రాజకీయ భవిష్యత్‌ను తనకు అప్పగిస్తే తాను చూసుకుంటానన్న భరోసాను ఇవ్వనున్నట్టు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement