Friday, May 10, 2024

రాజన్న సేవ‌లో కరీంనగర్ సిపి దంపతులు

వేముల‌వాడ – దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని కరీంనగర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎల్. సుబ్బరాయుడు కుటుంబ సభ్యులతో కలిసి శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సిపి దంపతులకు ఆలయ అధికారులు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు.

గర్భగుడిలో కొలువుదీరిన శ్రీ స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వచనం గావించారు. స్వామివారి చిత్రపటం మహాప్రసాదం సిపి దంపతులకు అందజేసి ఆలయ పర్యవేక్షకులు తిరుపతిరావు ఘనంగా సత్కరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement