Saturday, May 4, 2024

Breaking | భారీ వర్షాల ఎఫెక్ట్​.. 22న కూడా తెలంగాణలో స్కూళ్లకు సెలవు!

తెలంగాణ వ్యాప్తంగా మూడు రోజుల నుంచి విస్తారంగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. కాలు బయటపెట్టాలంటే వీడని ముసురుకు జనాలు భయపడుతున్నారు. ఇక.. భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల నేప‌థ్యంలో గురు, శుక్ర‌వారాల్లో రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థ‌ల‌కు విద్యాశాఖ సెల‌వులు ప్ర‌క‌టించింది. ఇప్పుడు తాజా మ‌రో 24 గంట‌ల పాటు రాష్ట్రంలో భారీ వ‌ర్షాలుంటాయన్న వార్తలతో విద్యాశాఖ అప్రమత్తమైంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేర‌కు జులై 22(శ‌నివారం)న కూడా అన్ని విద్యా సంస్థ‌ల‌కు సెల‌వు ప్ర‌క‌టిస్తూ విద్యాశాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ అన్ని జిల్లాల డీఈవోల‌కు ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement