Wednesday, May 1, 2024

జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌పై ఈడీ కేసు నమోదు.. కన్మోన్‌ సుఖేష్‌ కేసులో సప్లిమెంటరీ చార్జిషీట్‌

సుఖేష్‌ చంద్రశేఖర్ మనీల్యాండరింగ్‌ కేసుపై దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ బుధవారం యాక్టర్‌ జాక్వైలిన్‌ ఫెర్నాండేజ్‌ పేరును నిందితుల జాబితాలో చేర్చి సప్లమెంటరీ చార్జ్‌షీట్‌ను ఢిల్లి కోర్టులో నమోదు చేసింది. సుఖేష్‌ చంద్రశేఖర్‌ నుంచి నటి జాక్వైలిన్‌ ఖరీదైన బహుమతులు తీసుకున్నారని ఈడీ చార్జిషీట్‌లో పేర్కొంది. సుఖేష్‌ చంద్రశేఖర్‌ నుంచి శ్రీలంక నటి కోట్లాది రూపాయల విలువైన బహుమతులు తీసుకున్నారని ఈడీ చార్జిషీట్‌లో పేర్కొంది.

రూ. 52 లక్షల ఖరీదైన గుర్రం, ఒక్కొక్కటి రూ. 9లక్షలు చేసే మూడు పర్షియన్‌ పిల్లులు, గుస్సీ, చానెల్‌ బ్రాండ్స్‌ పలు డిజైనర్‌ బ్యాగ్‌లు, ఖరీదైన వంటసామాగ్రి, డిజైనర్‌ బట్టలు, జిమ్‌ డ్రెస్సులు, ఖరీదైన లూయిస్‌ వ్యూట్టన్‌ షూలు, డైమండ్‌ జ్యువలరీ సెట్‌, ఇయర్‌ రింగ్స్‌, ఖరీదైన హెర్మెస్‌ బ్రేస్‌లెట్స్‌, మిని కూపర్‌, నటి చెల్లెలుకు 1,73,000 డాలర్ల ధర కలిగిన బీఎండబ్ల్యు కారు, రోలెక్స్‌ వాచ్‌, ఆస్ట్రేలియాలో ఉన్న సోదరుడికి రూ. 15 లక్షలు తీసుకున్నట్లు ఈడీ పేర్కొంది. నటి జాక్వైలిన్‌ నుంచి రూ. 7 కోట్ల విలువైన కానుకలను సీజ్‌ చేసినట్లు తెలిపింది.

సుఖేష్‌ చంద్రశేఖర్‌ కన్మోన్‌లో రూ. 200 కోట్ల మనీల్యాండరింగ్‌కు పాల్పడినట్లు ఈడీ కేసు నమోదు చేసింది. హైప్రొఫైల్‌ వ్యక్తుల నుంచి సుఖేష్‌ డబ్బు వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రాన్‌బాక్సీ ప్రమోటర్ల వద్ద కూడా డబ్బు వసూళ్లకు పాల్పడ్డారని ఈడీ కేసులో పేర్కొంది. నటి జాక్వలైన్‌ను పలుమార్లు విచారించిన తర్వాత ఆమె వద్ద నుంచి రూ. 7 కోట్ల విలువ చేసే బహుమతులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. ఆగస్ట్‌ 7వ తేదీన సుఖేష్‌ అరెస్టయ్యే వరకు జాక్వైలిన్‌తో టచ్‌లో ఉన్నారని పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement