Tuesday, October 19, 2021

హుజురాబాద్ బైపోల్: స్వరం పెంచిన ఈటల..

హుజూరాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ ప్రకటించడంతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. ఎన్నికల ప్రచారాన్ని టీఆర్ఎస్, బీజేపీ నేతలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ప్రత్యర్థులపై మాటల తూటాలు పేల్చుతున్నారు. బీజేపీ తరుపున బరిలో ఉన్న ఈటల రాజేందర్.. టీఆర్‌ఎస్ పార్టీనే టార్గెట్ గా దూసుకుపోతున్నారు. సీఎం కేసీఆర్, మంత్రులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ”కేసీఆర్ అహంకానికి, హుజురాబాద్ ప్రజల ఆత్మగౌరవానికి జరుగుతున్న ఎన్నిక” అని ఈటల అని అభివర్ణించారు. సిఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు ప్రజాస్వామ్య విలువలను అపహాస్యం చేశారని మండిపడ్డారు. ఉప ఎన్నిక కోసం టీఆర్ఎస్ పార్టీ నేతలు నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఎక్కడా లేని విధంగా నియోజకవర్గంలో ప్రలోభాలకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. అధికార పార్టీ ఎలాంటి ప్రలోభాలకు గురిచేసినా హుజూరాబాద్ ప్రజలు ఈటలను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. మహిళలు, యువకులు, పెద్దలు అందరూ తన వెంటే ఉన్నారని ఈటల ధీమా వ్యక్తం చేశారు. మంత్రి హరీష్ రావు ప్రజాస్వామ్య విలువలను అపహాస్యం చేశారని విమర్శించారు. రాత్రి పూట పోలీస్ జీపులతో బీజేపీ నేతలను భయపెడుతున్నారని మండిపడ్డారు. టీఆర్‌ఎస్ నీచపు పార్టీ అని.. ఆ పార్టీ నేతలు నీచపు మనుషులని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలుపు కోసం దొంగ ఓట్లు చేర్చుతున్నారని ఆరోపించారు. చిల్లర చేష్టలు చేస్తే ప్రజలు సహించరని ఈటల వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి: హుజురాబాద్ ఉప ఎన్నిక: కాంగ్రెస్ అభ్యర్థిపై ఇంకా సస్పెన్స్!

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News