Friday, March 29, 2024

హుజురాబాద్ ఉప ఎన్నిక: కాంగ్రెస్ అభ్యర్థిపై ఇంకా సస్పెన్స్!

తెలంగాణలో హుజురాబాద్‌ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల కావడంతో ఎన్నికల వేడి మొదలైంది. ఉపఎన్నిక కోసం ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు అభ్యర్థి ప్రకటించారు. ఆత్మగౌరవం పేరుతో రాజీనామా చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందరే బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉండగా.. టీఆర్ఎస్ తరుపున గెల్లు శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. ఇప్పటికే ఈ రెండు పార్టీలు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. అయితే, ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పటి వరకు తమ పార్టీ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. కాంగ్రెస్ తరుపున మాజీ మంత్రి కొండా సురేఖ బరిలో ఉంటారని గత కొద్ది రోజులు ప్రచారం జరుగుతోంది. పార్టీ అధిష్టానం సైతం ఆమె పేరు ఖరారు చేసినట్లు గతంలో కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అయితే, నేటీకి కొండా సురేఖ పేరును మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ కూడా బరిలో ఉంటారనే చర్చ జరుగుతోంది. ఈ నెల 30న భూపాలపల్లిలో కాంగ్రెస్​ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఆ సభ తర్వాతే కాంగ్రెస్ తమ అభ్యర్థిని ప్రకటింటనున్నట్టు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: బిగ్ అప్డేట్: హుజురాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల..

Advertisement

తాజా వార్తలు

Advertisement