Sunday, April 28, 2024

ట్రాఫిక్ కార‌ణంగా – యోగి ప్ర‌మాణ స్వీకారానికి రాలేక‌పోయా – ఉమాభార‌తి

యూపీ సీఎంగా యోగి ప్ర‌మాణ స్వీకారానికి తాను హాజ‌రు కావ‌డానికి ల‌క్నో వ‌చ్చాన‌ని..అయితే ట్రాఫిక్ జామ్ కార‌ణంగా తాను ప్ర‌మాణ‌స్వీకార వేదిక వ‌ద్ద‌కు చేరుకోలేక‌పోయాన‌ని చెప్పారు పార్టీ సీనియర్ నేత ఉమాభారతి . ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ నిన్న ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి పార్టీ సీనియర్ నేత ఉమాభారతి కూడా హాజరు కావాల్సి ఉంది. అయితే, ఆమె ఈ కార్యక్రమానికి హాజరుకాలేరు. తాను హాజరు కాకపోవడానికి గల కారణాన్ని ఆమె వివరించారు. రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన యోగి ఆదిత్యనాథ్ జంబో కేబినెట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 2024 సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేబినెట్ ను ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. యోగి ప్రమాణస్వీకార కార్యక్రమానికి మోదీ, నడ్డా, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ తదితరులు హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement