Saturday, May 11, 2024

ఇంటి ముందు సిగ‌రెట్ తాగాడ‌ని యువ‌కుడి దారుణ‌హ‌త్య

ఇంటిముందు సిగ‌రెట్ తాగాడ‌ని యువ‌కుడిని దారుణ‌హ‌త్య చేసిన ఘ‌ట‌న దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. తన ఇంటి ఎదురుగా పొగ తాగినందుకు ఓ యువకున్ని మరో యువకుడు (17) హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని ఓ బ్యాగ్​లో కుక్కి ఇంటికి దూరంగా పడవేశాడు. ఈ ఘటన ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో జరిగింది. ఢిల్లీలోని మంగోల్​పురి ప్రాంతంలో ఓ బ్యాగ్​లో మృతదేహన్ని పోలీసులు గుర్తించారు. దర్యాప్తులో అసలు నిజాలు వెల్లడయ్యాయి. ఘటన జరిగిన కొద్ది గంటలకే నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. అనంతరం నిందితుడు అసలు విషయాన్ని పోలీసులకు చెప్పాడు. ఆ తర్వాత మృతదేహాన్ని బ్యాగులో కుక్కి దూరంగా పడేసినట్లు పేర్కొన్నారు. ఇంటి ఆవరణలో పొగ తాగుతున్న యువకున్ని (17) అడ్డగించాడు నిందితుడు. ఈ అంశంపై ఇరువురు వాగ్వాదానికి దిగారు. కోపంలో పొగ తాగుతున్న వ్యక్తిని యువకుడు గొంతు కోసి హత్య చేశాడని పోలీసులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement