Sunday, April 28, 2024

ఊహాగానాలు వద్దు.. త్వరితగతిన దర్యాప్తు.. వాస్తవాలు బయటికొస్తాయ్‌ : ఐఏఎఫ్‌

న్యూఢిల్లి: తమిళనాడులోని కూనూర్‌ వద్ద జరిగిన ఆర్మీ హెలికాప్టర్‌ ప్రమాదంపై అటు మీడియా.. ఇటు సోషల్‌ మీడియాలోనూ అనేక కథనాలు వస్తున్నాయి. దీంతో భారత్‌ వాయుసేన స్పందించింది. ఎటువంటి స్పష్టమైన సమాచారం లేని ఊహాగానాలకు దూరంగా ఉండాలని భారత వైమానిక దళం (ఐఏఎఫ్‌) స్పష్టం చేసింది. ప్రమాద ఘటనపై దర్యాప్తును తాము తరితగతిన పూర్తి చేస్తామని టిట్టర్‌ వేదికగా ఎయిర్‌ ఫోర్స్‌ ప్రకటించింది. విమాన ప్రమాదానికి గల కారణాలను శోధిస్తున్నామని, అందుకోసం వైమానిక దళం ట్రై సర్వీస్‌ కోర్టు ఆఫ్‌ ఎంక్వైరీ వేసిందని తెలిపింది. ఈ విచారణ త్వరిగతిన పూర్తవుతుందని పేర్కొంది.

గౌరవ మర్యాదను కాపాడుదాం..
వాస్తవాలు బయటకు వస్తాయని, అప్పటి వరకు ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి గౌరవ మర్యాదను కాపాడాలని వాయుసేన పేర్కొంది. ఎటువంటి సమాచారం లేని ఊహాగానాలకు దూరంగా ఉండాలని మరోసారి స్పష్టం చేసింది. హెలికాప్టర్‌ ప్రమాద ఘటనపై ఇప్పటికే త్రివిధ దళాలు సంయుక్త దర్యాప్తు ప్రారంభించాయని గురువారం పార్లమెంట్‌లో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రకటించారని ఐఏఎఫ్‌ గుర్తు చేసింది. ఎయిర్‌ మార్షల్‌ మానవేంద్ర సింగ్‌ నేతృత్వంలో ఈ దర్యాప్తు కొనసాగుతున్నట్టు తెలిపింది. ఇప్పటికే ఘటనా ప్రాంతాన్ని విచారణ కమిటీ పరిశీలించింది. అన్ని వివరాలు సేకరించి ఓ సమగ్ర నివేదికను సిద్ధం చేయనుంది. ఇటు ఫ్లయిట్‌ డేటా రికార్డర్‌ సమాచారం.. విశ్లేషించడం సాధ్యం కాకపోతే.. రష్యా నిపుణుల సాయాన్ని తీసుకోనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement