Friday, May 17, 2024

శృంగార ఆజ్జెక్టుగా న‌న్ను చూడొద్దు.. పొట్టి బ‌ట్ట‌ల్లో ఊహించుకోవ‌ద్దు: సాయిప‌ల్ల‌వి

తాను పెద్ద అందంగా ఏమీ ఉండదు.. పైగా ముఖ‌మంతా మొటిమ‌లు, మ‌చ్చ‌లు.. అయితేనేం తెలుగు ప్రేక్షకుల గుండెల్లో దేవ‌త‌లా నిలిచిపోయింది. త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త‌ను సొంతం చేసుకుంది ఈ నేచుర‌ల్ బ్యూటీ సాయిప‌ల్లవి.. త‌ను డాక్ట‌ర్ అయిన‌ప్ప‌టికీ మేకోవ‌ర్ చేసుకోకుండా సినిమాల్లో న‌టిస్తోంది. ప‌లు స్టేజీల‌పై కూడా త‌ను ఇట్ల‌నే ఉంటాన‌ని, మేక‌ప్ చేసుకోవ‌డం ఇష్టం లేద‌ని తేల్చి చెప్పేసింది. అంతేకాకుండా సెలెక్టివ్‌గా స్టోరీస్ ఎంచుకుంటూ అంద‌రికంటే తాను డిఫ‌రెంట్ అని ఫ్రూవ్ చేసుకుంటోంది.. కాగా, త‌న‌ను శృంగార‌ప‌ర‌మైన ఆబ్జెక్టివ్‌గా చూడొద్ద‌ని, పొట్టి డ్రెస్‌ల‌లో త‌న‌ను ఊహించుకోవ‌ద్ద‌ని అభిమానుల‌ను కోరుతోంది..

హీరోయిన్ సాయి పల్లవి సౌత్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. ఇప్పటి ట్రెండ్ కి తగ్గట్లుగా హాట్ డ్రెస్సుల్లో కనిపించకుండానే సాయి పల్లవి స్టార్ హీరోల స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకుంది. హీరోయిన్ సాయి పల్లవి సౌత్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. ఇప్పటి ట్రెండ్ కి తగ్గట్లుగా హాట్ డ్రెస్సుల్లో కనిపించకుండానే స్టార్ హీరోల స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకుంది.

పొట్టి బట్టలు వేసుకోకుండానే అందంగా కనిపిస్తూ కుర్రాళ్ల గుండెల్లో చోటు సంపాదించుకుంది. సిల్వర్ స్క్రీన్ పై సాయి పల్లవి పొట్టి పొట్టి బట్టలు వేసుకోదు. దీని గురించి పలుమార్లు స్పందించిన సాయి పల్లవి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మరోసారి ఓపెన్ అయింది. పొట్టి బట్టలు తనకు సౌకర్యవంతంగా ఉండవని పేర్కొంది. తనకు పొట్టి బట్టలు ఎందుకు సౌకర్యవంతంగా ఉండవో కూడా సాయి పల్లవి వివరణ ఇచ్చింది.

ప్రేమమ్ చిత్రంలో డాన్స్ కోసం స్ప్లిట్ డ్రెస్ లో కనిపించాను. ఆ వీడియో ఇంటర్నెట్ లో తెగ వైరల్ అయ్యింది. అందరూ ఆ డ్రెస్ ని పాస్ చేసి మరీ చూడడం ప్రారంభించారు. జనాలు నన్ను అలా చూడడం నాకు ఇష్టం లేదు. విదేశాల్లో ఎలాంటి బట్టలు వేసుకున్నా అక్కడి ప్రజల చూపుల్లో తేడా ఉండదు. కానీ, ఇక్కడ పొట్టి బట్టలు వేసుకుంటే నాకు సౌకర్యంగా అనిపించదు అని తెలిపింది. అందుకే పొట్టి బట్టలకు తాను దూరంగా ఉంటాన‌ని వెల్లడించింది.

ఇక సినిమాల్లో గ్లామర్ గా కనిపించడం అంటే చాలా రకాలుగా చెప్పుకోవచ్చు. ఎవరి ఇష్టం వారిది. నేను ఇలా ఉండడమే నాకు కంఫర్టబుల్ గా ఉందని సాయి పల్లవి పేర్కొంది. పొట్టి బట్టలు వేసుకోవడం నేను తప్పు అని చెప్పను. చూసే విధానంలోనే ఉంటుందని పేర్కంది. కాగా, ప్రస్తుతం సాయి పల్లవి రానా సరసన విరాట పర్వం చిత్రంలో నటించింది. జూన్ 17న ఈ చిత్రం రిలీజ్ కానుంది. నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ మూవీపై అంద‌రిలోనూ ఉత్కంఠ నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement