Thursday, April 25, 2024

చార్​ధామ్ యాత్రకు వద్దే వద్దు.. వెళ్తే బుక్​ అయిపోతారు జాగ్రత్త!

ప్రతి హిందువు తన జీవితంలో ఒకసారైనా చార్​ధామ్​ యాత్ర చేయాలను అనుకుంటారు. అమర్​నాథ్​, మానససరోవర్​, అందరికీ చేతకావు. చాలా వ్యయప్రయాసతో కూడిన సాహస యాత్రలివి. చార్​ధామ్​ అంటే గంగోత్రి, యమునోత్రి, కేదార్​నాథ్​, బద్రీనాథ్​.. అయితే కొవిడ్​ మహమ్మారితో చాలా కాలంగా ఈ యాత్రలకు అనుమతి ఇవ్వడం లేదు. కాస్త రిలీఫ్​ దొరకడంతో ఇప్పుడు యాత్రికులను అనుమతించాయి అక్కడి ప్రభుత్వాలు. దీంతో భక్తులు పెద్ద ఎత్తున తరలి వెళ్తుండడంతో ట్రాఫిక్​ జామ్​లు, రూమ్​లు దొరక్కపోవడాలు, డబుల్​ చార్జీల వంటి కష్టాలు ఎదురవుతున్నట్టు కొంతమంది యాత్రికుల ద్వారా తెలుస్తోంది. అందుకని ఈ సారి చార్​ధామ్​ యాత్రకు వెళ్లొద్దంటున్నారు పెద్దలు.

ఇక.. చార్‌ధామ్‌ యాత్రలో భాగంగా యమునోత్రి, గంగోత్రి, కేదార్ నాథ్, బద్రీనాథ్ దర్శనాల కోసం  భక్తులు పోటెత్తుతున్నారు. కరోనా కారణంగా రెండేళ్ల పాటు దర్శనాలు రద్దు కావడంతో ఇప్పుడు పుణ్య క్షేత్రాలను దర్శించుకుంటున్నారు. ‍కొండదారుల్లో అత్యంత క్లిషమైన ప్రయాణం సాగించడమే కాకుండా మంచు, చలి, ప్రకృతి పరంగా అవరోధాలను ఎదుర్కోవాల్సి వస్తోంది. మధ్యాహ్నం వేళ కేవలం 5 డిగ్రీల ఉష్ఞొగ్రత, రాత్రివేళ మైనస్‌ డిగ్రీల ఉష్ఞొగ్రతలు నమోదు కావడంతో భక్తులకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. కాగా, రెండు వారాల్లో 39 భక్తులు మృతి చెందారు. దీనికి అక్కడి అధికారులు గుండెపోటు కారణంగా చబెతున్నారు.

ఈ పుణ్యక్షేత్రాల ప్రయాణంలో వసతి సౌకర్యాలు లేకపోతే కష్టాలు మరింత ఎక్కువ అవుతాయి. సముద్ర మట్టానికి 3 కిలోమీటర్ల కంటే ఎత్తున క్షేత్రాలు ఉండటంతో తక్కువ స్థాయిలో ఆక్సిజన్‌ లభ్యమవుతుంది. దాంతో గతంలో కొవిడ్‌ వచ్చిన భక్తులు ఆకస్మికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ యాత్రలకు రోజూ 20వేల మంది పైగా భక్తులు వస్తుండటంతో ఏర్పాట్లు కూడా సక్రమంగా లేవు. దీంతో మరింత క్లిష్టంగా పరిస్థితులు మారాయి. కొండలపై సౌకర్యం ఉన్నది కేవలం 5వేల మందికే కావడంతో భారీ సంఖ్యలో వస్తున్న భక్తులకు ఏర్పాట్లు చేయలేమని చేతులెత్తేస్తున్నారు అక్కడి అధికారులు.

అత్యంత క్లిషమైన ప్రయాణం కేదార్‌నాథ్‌
ఈ యాత్రల్లో కేదార్‌నాథ్‌ అత్యంత క్లిషమైంది. గౌరీఖుండ్‌ నుంచి కేదార్‌ నాథ్‌కు 18 కి.మీ ట్రెక్కింగ్‌ సౌకర్యం ఉన్నా,  ట్రెక్కింగ్‌ సమయంలో హైబీపీ, గుండెపోటు సమస్యలు వస్తున్నాయి. పరిస్థితి తీవ్రం కావడంతో 132 మంది డాక్టర్లను ఉత్తరాఖాండ్‌ ప్రభుత్వం రంగంలోకి దించింది. అదే సమయంలో ముందస్తు ఏర్పాట్లు లేనిదే చార్‌ధామ్‌ యాత్రకు రావొద్దని ప్రభుత్వం అంటోంది. సరిపడా అందుబాటులో లేని రవాణా సౌకర్యాలతో పాటు, హరిద్వార్‌-రుషికేష్‌ మధ్య వాహనాలు భారీగా నిలిచిపోవడం అధికార యంత్రాంగానికి సవాల్‌గా మారుతోంది. రుద్ర ప్రయాగ నుంచి అన్ని రూట్లలో విపరీతమైన ట్రాఫిక్ జామ్‌ అవుతుండడంతో అధికారులకు తలనొప్పిగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement