Friday, May 10, 2024

ఎక్స్ఈ వేరియంట్ కు భ‌య‌ప‌డొద్దు : ఎన్టీఏజీఐ

ఎక్స్ఈ వేరియంట్ కు భ‌య‌ప‌డొద్ద‌ని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ (ఎన్టీఏజీఐ) చీఫ్​ ఎన్కే అరోరా అన్నారు. ఆయ‌న మాట్లాడుతూ.. కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుతున్న వేళ.. కొన్ని రాష్ట్రాల్లో కొత్త వేరియంట్ కేసులు బయపడుతున్నాయని, ముఖ్యంగా వేగంగా వ్యాప్తి చెందుతని భావిస్తోన్న ఎక్స్ఈ వేరియంట్ కేసులు గుజరాత్, మహారాష్ట్రలో వెలుగు చూడటం ఆందోళన రేపుతోందన్నారు. ఈ నేపథ్యంలో నూతన వేరియంట్ కేసులపై కొవిడ్ వర్కింగ్ గ్రూప్ స్పందించింది. భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. కొత్త వేరియంట్ తీవ్ర వ్యాధికి కారణమవుతుందని చెప్పడానికి ప్రస్తుతం ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది. ఇటువంటి వేరియంట్లు వస్తూనే ఉంటాయని.. భయపడొద్దన్నారు. అయితే, ఎక్స్ఈ వేరియంట్ వ్యాప్తి, తీవ్రతపై స్పష్టమైన ఆధారాలు లేనప్పటికీ ప్రాథమిక ఆధారాల ప్రకారం ఈ వేరియంట్ అధిక సాంక్రమిక శక్తి కలిగి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement