Tuesday, April 30, 2024

మీ ద‌గ్గ‌ర డేంజ‌ర‌స్ బాయ్స్ ఉంటే – నా ద‌గ్గ‌ర డేంజ‌ర‌స్ గ‌ర్ల్స్ ఉన్నారు – రామ్ గోపాల్ వ‌ర్మ‌

ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి, ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ల‌ను త‌న మూవీ ప్ర‌మోష‌న్స్ కోసం వాడుకున్నారు మ‌రో ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌. ‘వెల్ రాజమౌళి సార్. మీకు తారక్, రామ్ చరణ్ వంటి డేంజరస్ బోయ్స్ ఉంటే… నాకు నైనా గంగూలీ, అప్సర రాణి వంటి డేంజరస్ గర్ల్స్ ఉన్నారు’ అని ట్వీట్ చేశారు. అంతేకాదు చరణ్, రాజమౌళి, తారక్ కలిసి ఉన్న ఫొటోతో పాటు… అప్సర, నైనాలతో తాను కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు.వర్మ తెరకెక్కించిన ‘మా ఇష్టం (డేంజరస్)’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అప్సర రాణి, నైనా గంగూలీలతో వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. లెస్బియనిజం కథాంశంతో ఈ చిత్రాన్ని వర్మ రూపొందించారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో వర్మ బిజీగా ఉన్నారు. ప్రమోషన్ లో భాగంగా వర్మ ఏ అంశాన్ని వదలడం లేదు. అన్ని అంశాలను తన సినిమా ప్రమోషన్ కు వాడుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement