Thursday, May 9, 2024

ఆరు నెల‌ల‌కే డెలివ‌రీ.. 94రోజులు ఇంటెన్సివ్ కేర్ లో శిశువు

ఆరు నెల‌ల‌కే ప్ర‌స‌వించింది ఓ మ‌హిళ‌..24 వారాలు తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన శిశువు ప్రాణంతో నిలవడం అన్నది వైద్య శాస్త్రంలో అసాధారణమైన విషయమేనని నిపుణులు చెబుతున్నారు. ఈ అసాధ్యమే సుసాధ్యమయ్యింది. తొమ్మిది నెలలకు కానీ, శిశువులోని అన్ని అవయవాలు ఏర్పడి అవి కొంత వరకు వృద్ధి చెందవు. అంటే అవయవాలు పూర్తి స్థాయిలో ఎదగకుండానే బయటకు వచ్చిన శిశువును వైద్యులు కాపాడారు. మహారాష్ట్రలోని పుణెలో ఇది సాధ్యమైంది. వాకాడ్ ప్రాంతానికి చెందిన ఈ కేసు వివరాలు వెలుగులోకి వచ్చాయి.

చాలా ముందుగా జన్మించిన అతి తక్కువ వయసున్న బేబీగా వైద్యులు చెబుతున్నారు.గతేడాది మే 21న ఈ బేబీ జన్మించగా, అప్పటి నుంచి 94 రోజుల పాటు శిశువును ఇంటెన్సివ్ కేర్ లో ఉంచి వైద్యులు కాపాడారు. చిన్నారి శివన్య పూర్తిగా ఎదిగినట్టు గుర్తించిన తర్వాత 2022 ఆగస్ట్ 23న డిశ్చార్జ్ చేశారు. ఆ సమయానికి బేబీ బరువు 2,130 గ్రాములకు చేరింది. నిజానికి ఇలా ముందస్తుగా పుట్టిన బేబీలు జీవించే అవకాశాలు అర శాతంలోపే ఉంటాయని వైద్యులు వెల్లడించారు. సాధారణంగా అయితే 37-40 వారాల మధ్య బేబీలు 2,500 గ్రాములు అంతకుమించిన బరువుతో జన్మిస్తుంటారు.ప్రస్తుతం ఈ బేబీ 4.5 కిలోల బరువుకు చేరుకుంది. అందరి పిల్లల్లా ఆరోగ్యంగానే ఉండడమే కాకుండా, ఆహరం కూడా తీసుకుంటోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement