Thursday, May 2, 2024

ఢిల్లీ మెకానికల్ ఇంజనీర్ ఘనత…’కాలుష్య నివార‌ణ’ ప‌రిక‌రం..

కాలుష్యం వ‌ల్ల ఆరోగ్యంతో పాటు ప్ర‌కృతి కూడా దెబ్బ‌తింటోంది. ఈ కాలుష్య నివార‌ణ‌కు ప‌లు రాష్ట్రాలు ఎన్నో చ‌ర్య‌లు తీసుకున్నా ప‌రిస్థితి చేజారుతోంది. కాగా కాలుష్యాన్ని నివారించేందుకు ఓ చిన్న ప‌రిక‌రాన్ని త‌యారు చేశాడు న్యూఢిల్లీకి చెందిన విద్యుత్ మోహన్ అనే మెకానికల్ ఇంజనీర్ . ఆ ప‌రిక‌రం కాలుష్యానికి పరిష్కారం అంటున్నారు దేశాధినేతలు. ఇటీవల జర్మనీలోని గ్లాస్గోలో నిర్వహించిన కాప్ 26 సదస్సులోనూ విద్యుత్ మోహ‌న్ పాల్గొన్నారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ అత‌న్ని కలిశారు. కేవలం 2 నిమిషాలే ఆయన తనతో మాట్లాడారని విద్యుత్ మోహన్ చెప్పారు. రెండు నిమిషాల మీటింగే అయినా తన ఆవిష్కరణకు ప్రభుత్వ ప్రోత్సాహం దొరుకుతుందన్న నమ్మకం పెరిగిందన్నారు. తన ప్రాజెక్టును మరింత భారీగా నిర్వహించేందుకు అవకాశం దొరుకుతుందని తెలిపారు.

ఆవిష్కరణకు ప్రఖ్యాత ఎర్త్ షాట్ అవార్డు (బ్రిటన్ ప్రిన్స్ విలియమ్ ప్రారంభించిన అవార్డు) కూడా ఇటీవల అత‌న్ని వరించింది. ఢిల్లీలో పొల్యూషన్ వల్ల విద్యుత్ మోహన్, ఆయన నానమ్మ అనారోగ్యానికి గురయ్యేవారు. దీంతో దాని పరిష్కారం కోసం విద్యుత్ ప్రయత్నించారు. టన్నుల కొద్దీ వ్యర్థాలను పునరుత్పాదక ఇంధనం, ఎరువులుగా మార్చే ఓ ట్రాక్టర్ పరికరాన్ని ఆయన కనిపెట్టారు. వరి గడ్డి, కొబ్బరి చిప్పలను మండించి విద్యుత్ నూ తయారు చేయవచ్చు. ఇప్పటికే ఉత్తరాఖండ్ లో ఈ పరికరాన్ని పైలట్ ప్రాజెక్టుగా వినియోగిస్తున్నారు. చాలా ప్రాంతాల్లోనూ టెస్ట్ చేస్తున్నారు. ఈ సాంకేతిక పరిజ్ఞానం వల్ల కర్బన ఉద్గారాలను 98 శాతం తగ్గించొచ్చు. దాని వల్ల ఉద్యోగాలనూ సృష్టించవచ్చని చెబుతున్నారు. ఈ టెక్నాలజీ కోసం takachar.com అనే ఓ సంస్థను స్థాపించి దాని ద్వారా పొల్యూషన్ ను నియంత్రించేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement