Saturday, May 4, 2024

త‌గ్గిన బంగారం ధ‌ర – పెరిగిన వెండి రేటు

ప‌సిడి ప్రియుల‌కు శుభ‌వార్త బంగారం ధ‌ర త‌గ్గుముఖం ప‌ట్టింది. గ‌త కొన్ని రోజులుగా పెరుగుతూ వ‌స్తోన్న బంగారం ధ‌ర‌కి నేడు బ్రేకులు ప‌డ్డాయి. బంగారం ధర తగ్గితే.. వెండి రేటు మాత్రం భారీగా పెరిగింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పైకి కదిలాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో బంగారం ధర పడిపోయింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.550 దిగొచ్చింది. దీంతో పసిడి రేటు రూ. 50,510కు తగ్గింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.510 క్షీణించింది. దీంతో పసిడి రేటు రూ. 46,300కు తగ్గింది. బంగారం ధరలు దిగివస్తే.. వెండి మాత్రం దూసుకుపోయింది. భారీగా పెరిగింది. రూ.1200 పైకి కదిలింది. దీంతో కేజీ వెండి ధర రూ.68,600కు ఎగసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement