Friday, May 3, 2024

కేజీఎఫ్‌2 -80అడుగుల ప్ర‌త్యేక బ్యాన‌ర్-జీ తెలుగులో స్ట్రీమింగ్

కేజీఎఫ్ చాఫ్ట‌ర్ 2 శాటిలైట్ హ‌క్కుల‌ను జీ తెలుగు భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. ఈ చిత్రం 2022 ఆగ‌స్టు 21 ఆదివారం సాయంత్రం 5:30 గంట‌ల‌కు జీ తెలుగులో స్ట్రీమింగ్ కానుందని ప్ర‌క‌టించింది జీ ఛాన‌ల్‌. స‌ద‌రు ఛాన‌ల్ కేజీఎఫ్ చాఫ్ట‌ర్‌ 2 సినిమాకు సంబంధించిన 80 అడుగుల ప్ర‌త్యేక బ్యాన‌ర్‌ను లాంఛ్ చేస్తూ ఈ విష‌యాన్ని అనౌన్స్ చేసింది. ఇపుడీ భారీ పోస్ట‌ర్ స్టిల్స్ నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఈ చిత్రంలో హీరోగా య‌శ్ న‌టంచ‌గా.. శ్రీనిధి శెట్టి ఫీ మేల్ లీడ్ రోల్‌లో మెరిసింది. బాలీవుడ్ యాక్ట‌ర్లు సంజ‌య్ ద‌త్‌, న‌టి ర‌వీనాటాండ‌న్ తోపాటు ప్ర‌కాశ్ రాజ్‌, రావు ర‌మేశ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.క‌న్న‌డ‌, తెలుగు, హిందీతోపాటు ప‌లు భాష‌ల్లో విడుద‌లైన ఈ చిత్రం వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.1000 కోట్ల మైల్ స్టోన్‌ను క్రాస్ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement