Saturday, May 18, 2024

తెల్ల బంగారానికి కాసుల వర్షం.. క్వింటాల్‌ పత్తి ధర రూ.10 వేలు

వరంగల్ జిల్లాలో తెల్ల బంగారానికి కాసుల వర్షం కురుస్తున్నది. పత్తికి ధర రోజురోజుకి ఎగబాకుతోంది. మంగళవారం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో రికార్డు స్థాయిలో క్వింటాల్‌ పత్తి ధర రూ. 10,235 ధర పలికింది. జనగామ జిల్లా పాలకుర్తి మండలం జఫర్‌గడ్‌ గ్రామానికి చెందిన రైతు 17 బస్తాల పత్తిని మార్కెట్‌కు తెచ్చాడు. దీనికి ఖరీదుదారులు గరిష్ట ధర రూ. 10,235 నిర్ణయించారు. మార్కెట్ లో ఇప్పటివరకు పత్తికి ఇదే అత్యధిక ధర అని మార్కెట్‌ వర్గాలు తెలిపాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement