Sunday, April 28, 2024

ఎంసెట్‌లో ఈ’సారీ’ నో వెయిటేజీ..?

కొన్ని రోజులుగా కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు రాష్ట్రంలో భారీగానే నమోదవుతున్నాయి. మూడో వేవ్‌ ఇక తప్పదనడానికి ఈ కేసులే నిదర్శనమని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈక్రమంలో రాబోయే రోజుల్లో పరిస్థితులు ఇలానే ఉండి కేసుల సంఖ్య పెరిగితే ఈ ఏడాదిలో జరిగే ఎంసెట్‌ ద్వారా ఇంజనీరింగ్‌ సీట్ల భర్తీ ప్రక్రియలో ఇంటర్‌ వెయిటేజ్‌ను ఎత్తివేసే అవకాశాలు ఉన్నట్లు తెలంగాణ ఉన్నత విద్యా మండలిలోని ఓ అధికారి తెలిపారు. గతేడాది కూడా ఇంటర్‌ మార్కుల వెయిటేజ్‌ను ఎత్తివేస్తూ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. నిజానికి ఇంటర్‌లో వచ్చిన మార్కుల వెయిటేజ్‌ను ఇంజనీరింగ్‌ సీట్ల భర్తీ ప్రక్రియలో తీసుకునే వారు. కానీ కరోనా కారణంగా గతేడాది ఇంటర్‌ పరీక్షలు రద్దు చేయడంతో అప్పట్లో వెయిటేజ్‌ను ఎత్తివేశారు.

గతంలో 45 శాతం మార్కులు ఉంటేనే ఇంజనీరింగ్‌ సీటు పొందే అవకాశం ఉండేది. కానీ పోయిన ఏడాది పరీక్షలు రద్దు కావడం, వెయిటేజ్‌ తీసేయడంతో ఎంసెట్‌లో అర్హత సాధించిన వారందరూ కౌన్సెలింగ్‌కు అర్హులు అయ్యారు. 2020-21 ఏడాదిలో కరోనా నేపథ్యంలో ఇంటర్‌ పరీక్షలను నిర్వహించని ప్రభుత్వం ఎంసెట్‌ పరీక్షలను మాత్రం సజావుగా నిర్వహించింది. కరోనా ప్రభావం పొంచి ఉన్న నేపథ్యంలో పలుమార్లు ఎంసెట్‌ దరఖాస్తు చేసుకునే తేదీని పొడిగిస్తూ వచ్చిన అధికారులు ఎట్టకేలకు పరీక్షలను విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొన్ని రోజులుగా 1500 నుంచి 2000 మధ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement