Friday, May 10, 2024

వివేకానందుని మార్గం అందరికీ ఆదర్శం : సీఎం జ‌గ‌న్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. ‘అత్యున్నత లక్ష్యానికి జీవితాన్నంతా ధారపోయమని సందేశాన్నిచ్చిన సంస్కరణవాది, విశ్వమానవుడు వివేకానందుని జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళి. దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన వివేకానందుని మార్గం అందరికీ ఆదర్శం’ అని సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు. యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని సీఎం జగన్‌ యువతకు శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే ఆయ‌న ట్వీట్ చేసిన విష‌యాన్ని కూ యాప్ ద్వారా తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement